కరైకుడి (తమిళనాడు): జాతీయ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష నాలుగో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో ప్రత్యూష ఎనిమిది పాయింట్లు సాధించింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రత్యూష ఏడు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో పరాజయం పాలైంది.
10 పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ భక్తి కులకర్ణి (ఎయిరిండియా) టైటిల్ నిలబెట్టుకోగా... 8.5 పాయింట్లతో వంతిక అగర్వాల్ (ఢిల్లీ), దివ్య దేశ్‌ముఖ్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా వంతిక రన్నరప్‌గా నిలిచింది. దివ్య దేశ్‌ముఖ్‌కు మూడో స్థానం లభించింది. ఈ టోర్నీలో పోటీపడిన ఇతర ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు జి.హర్షిత (7.5 పాయింట్లు) పదో స్థానంలో, వి.తోషాలి (6 పాయింట్లు) 38వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment