సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ పోటీల్లో పాల్గొనే భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూషకు తొలిసారి స్థానం లభించింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 14 వరకు అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా (ఢిల్లీ), పద్మిని (ఒడిషా) జట్టులోని ఇతర సభ్యులు.