విజయవాడ స్పోర్ట్స్: వచ్చే నెలలో చైనీస్ తైపీలో జరిగే ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల రికర్వ్ జట్టులో విజయవాడ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఎంపికయ్యాడు. చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ విద్యార్థి అయిన ధీరజ్ హరియాణాలో జరిగిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచి భారత జట్టులో స్థానాన్ని సంపాదించాడు. దేశవ్యాప్తంగా 30 మంది ఆర్చర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. నాలుగున్నరేళ్ల వయస్సులో దివంగత కోచ్ చెరుకూరి లెనిన్ వద్ద శిక్షణ ప్రారంభించిన ధీరజ్ జాతీయ అండర్–19 స్కూల్ గేమ్స్‌లో విజేతగా కూడా నిలిచాడు. ఓల్గా అకాడమీకి చెందిన మరో ఆర్చర్ తేళ్ల రవిచంద్ర భారత జట్టులో స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment