జలజ్‌కు 6 వికెట్లు | Jalaj 6 wickets | Sakshi
Sakshi News home page

జలజ్‌కు 6 వికెట్లు

Published Fri, Aug 30 2013 2:43 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

Jalaj 6 wickets

సాక్షి, విశాఖపట్నం: భారత పర్యటనలో న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. ఇక్కటి పోర్ట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘ఎ’తో ప్రారంభమైన మొదటి అనధికారిక టెస్టులో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. లూక్ రాంచి (110 బంతుల్లో 125; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... టాడ్ ఆస్టల్ (157 బంతుల్లో 63; 7 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు.
 
 భారత్ ‘ఎ’ బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ జలజ్ సక్సేనా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 106 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అతను తన ఫస్ట్‌క్లాస్  కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సరికి 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ఉన్ముక్త్ చంద్ (4) అవుట్ కాగా, జీవన్‌జోత్ సింగ్ (1), సరబ్‌జిత్ సింగ్ లడ్డా (1) క్రీజ్‌లో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement