కోల్‌‘కొత్త రికార్డు’ | Kolkata new record ' | Sakshi
Sakshi News home page

కోల్‌‘కొత్త రికార్డు’

Published Tue, Sep 30 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

కోల్‌‘కొత్త రికార్డు’

కోల్‌‘కొత్త రికార్డు’

సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక టి20 మ్యాచ్‌లు (13) గెలిచిన జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ రికార్డు సృష్టించింది. గతంలో బెంగాల్ రంజీ జట్టు పేరిట ఉన్న 12 మ్యాచ్‌ల రికార్డును అధిగమించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ' లీగ్ మ్యాచ్‌లో గంభీర్ సేన 36 పరుగుల తేడాతో డాల్ఫిన్స్‌ను చిత్తు చేసింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. గంభీర్ (12), కలిస్ (6) ఆరంభంలోనే వెనుదిరిగారు. అయితే  ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాబిన్ ఉతప్ప (55 బంతుల్లో 85 నాటౌట్; 13 ఫోర్లు), మనీష్ పాండే (47 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నైట్‌రైడర్స్ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 90 బంతుల్లోనే 153 పరుగులు జోడించారు.  కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.
  అనంతరం డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫెలుక్‌వాయో (18 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్), వాన్‌విక్ (28 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), జోండో (25 బంతుల్లో 32; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించినా... తమ  జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. నరైన్ 3, పఠాన్ 2 వికెట్లు పడగొట్టారు.  
 స్కోరు వివరాలు
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (నాటౌట్) 85; గంభీర్ (బి) ఫ్రైలింక్ 12; కలిస్ (బి) అలెగ్జాండర్ 6; పాండే (నాటౌట్) 76; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 187.
 వికెట్ల పతనం: 1-25; 2-34.
 బౌలింగ్: అబాట్ 4-0-39-0; అలెగ్జాండర్ 4-0-36-1; ఫ్రైలింక్ 4-0-29-1; డెల్‌పోర్ట్ 2-0-19-0; ఫెలుక్‌వాయో 1-0-17-0; సుబ్రయేన్ 4-0-30-0; జోండో 1-0-15-0.
 డాల్ఫిన్స్ ఇన్నింగ్స్: వాన్‌విక్ (సి) పాండే (సి) పఠాన్ 34; డెల్‌పోర్ట్ (సి) గంభీర్ (బి) పఠాన్ 0; చెట్టీ (సి) నరైన్ (బి) రసెల్ 1; జార్స్‌వెల్డ్ (స్టంప్డ్) ఉతప్ప (బి) చావ్లా 19; జోండో (సి) చావ్లా (బి) నరైన్ 32; ఫెలుక్‌వాయో (బి) నరైన్ 37; ఫ్రైలింక్ (సి) చావ్లా (బి) నరైన్ 11; వాండియర్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 1; అబాట్ (నాటౌట్) 5; సుబ్రయేన్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151.
 వికెట్ల పతనం: 1-5; 2-6; 3-53; 4-57; 5-120; 6-136; 7-136; 8-138.
 బౌలింగ్: పఠాన్ 4-0-25-2; రసెల్ 3-0-17-1; కుల్దీప్ 4-0-30-1; నరైన్ 4-0-33-3; చావ్లా 3-0-19-1; సూర్యకుమార్ 1-0-7-0; డస్కటే 1-0-18-0.


 

Advertisement
Advertisement