ముంబై మెరిసింది
ముంబై: సొంతగడ్డపై ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టు చెలరేగింది. ఐఎస్‌ఎల్ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో పరాజయం ఎదురైనప్పటికీ తమ రెండో మ్యాచ్‌లోనే లోపాలను సరిదిద్దుకుంది. దీనికి తోడు మిడ్ ఫీల్డర్ ఆండ్రీ మోరిట్జ్ అద్భుత విన్యాసాలతో హ్యాట్రిక్ గోల్స్ సాధించగా శనివారం డీవై పాటిల్ స్టేడియంలో ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5-0తో ఘన విజయం సాధించింది. సుభాష్ సింగ్, జోహాన్ లెట్జెల్టర్ చెరో గోల్ సాధించారు. లీగ్‌లో ఇప్పటిదాకా ఏ జట్టూ ఇన్ని గోల్స్ చేయలేదు. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో అట్లెటికో డి కోల్‌కతా తో ఢిల్లీ డైనమోస్; నార్త్‌ఈస్ట్ యునెటైడ్‌తో గోవా ఎఫ్‌సీ తలపడతాయి.