లంక ముందు కొండంత లక్ష్యం | In the second Test Australia had set a goal in front of Sri Lanka | Sakshi
Sakshi News home page

లంక ముందు కొండంత లక్ష్యం

Published Mon, Feb 4 2019 2:46 AM | Last Updated on Mon, Feb 4 2019 2:46 AM

In the second Test  Australia had set a goal in front of Sri Lanka - Sakshi

కాన్‌బెర్రా: రెండో టెస్టులో ఆస్ట్రేలియా... శ్రీలంక ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న ఈ టెస్టులో శ్రీలంకకు 516 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌ ద్వారా ఎట్టకేలకు ఉస్మాన్‌ ఖాజా (101 నాటౌట్, 14 ఫోర్లు) ఫామ్‌లోకి వచ్చాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 123/3తో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల వద్ద ఆలౌటైంది. స్టార్క్‌ (5/54) లంకపై పంజా విసిరాడు. లయన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆసీస్‌ను ఖాజా నడిపించాడు. జట్టులో స్థానం ప్రశ్నార్థకమైన దశలో శ్రీలంకపై అజేయ శతకం సాధించాడు.

దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. ఓపెనర్లు హారిస్‌ (14), బర్న్స్‌ (9)లతో పాటు లబ్‌షేన్‌ (4) విఫలం కాగా... ఖాజా, హెడ్‌ (59 నాటౌట్‌; 8 ఫోర్లు) అజేయంగా రాణించారు. ఇద్దరు అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. ఖాజా సెంచరీ పూర్తవగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. కరుణరత్నే (8 బ్యాటింగ్‌), తిరిమన్నె (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement