భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా నియామకం ఖరారైన నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ సారథి సౌరవ్ గంగూలీకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దాదాకు సన్నిహితుడిగా పేరొందిన డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో తన ‘కెప్టెన్’కు విషెస్ చెప్పాడు. ‘ టీమిండియా కెప్టెన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడి దాకా గొప్ప వ్యక్తి.. గొప్ప ప్రయాణం. క్రికెటర్ పాలనలోకి దిగితే.. అదే విధంగా ఆటగాళ్ల కోణం నుంచి పాలన సాగించడం ఎలా ఉంటుందో ఆలోచించండి. గుడ్‌లక్ దాదా’ అంటూ యువీ గంగూలీపై అభిమానం చాటుకున్నాడు. ఇక యువీ ట్వీట్‌పై గంగూలీ సైతం అదే రీతిలో బదులిచ్చాడు. ‘థ్యాంక్యూ బెస్ట్. ఇండియా కోసం ప్రపంచ కప్‌లు గెలిచావు. ఇక ఆట కోసం కొన్ని మంచి పనులు చేయాల్సి ఉంటుంది. నువ్వు నా సూపర్‌స్టార్‌వి. ఆ దేవుడి దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.
ఈ క్రమంలో దాదా బీసీసీఐ అధ్యక్షుడైన నేపథ్యంలో భారత క్రికెట్‌లో యువీ కీలక సేవలు అందించే అవకాశం ఉందని అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా యువరాజ్‌సింగ్ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తనకు విషెస్ చెప్పిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్‌కు సైతం దాదా ఈ తరహాలోనే స్పందించాడు. ‘ థాంక్యూ భజ్జీ. నువ్వు ఎలాగైతే భారత్‌కు విజయాలు అందించావో అదే తరహా నీ సహకారం మాకు కావాలి. భజ్జీ.. నీ అవసరం ఉంది’ అంటూ గంగూలీ ట్వీట్ చేయడంతో హర్భజన్ మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Greater the man greatest the journey! Frm IndianCaptain to @BCCI president.Think it will b a gr8 insight 4 a cricketer to be an administrator & make others understand admin frm a players point of view Wish u were d president while d yoyo was in demand😂good luck dadi👊@SGanguly99
— yuvraj singh (@YUVSTRONG12) October 18, 2019
Comments
Please login to add a commentAdd a comment