సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆగాఖాన్ అకాడమీకి చెందిన స్విమ్మర్ సురేంద్ర సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ టోర్నీలో 4 స్వర్ణాలు, ఒక రజతాన్ని కైవసం చేసుకున్నాడు. 50 మీ. బ్యాక్‌స్ట్రోక్, 100 మీ. బ్యాక్‌స్ట్రోక్, 50 మీ. బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లలో సురేంద్ర పసిడి పతకాలను సాధించాడు. 4/50 మీ.మెడ్లీలో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకున్నాడు. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన రామ్‌శంకర్ రజత, కాంస్యాలను సాధించాడు. 50మీ. ఫ్రీస్టయిల్‌లో రెండో స్థానంలో నిలిచిన శంకర్, 4/50 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
గ్లెన్‌డేల్ అకాడమీకి చెందిన స్విమ్మర్ శివ యాదవ్ స్వర్ణ, రజతాలను సొంతం చేసుకున్నాడు. 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో శివ చాంపియన్‌గా నిలిచాడు. 4/50 ఫ్రీస్టయిల్ రిలేలో రెండో స్థానం తో సరిపెట్టుకున్నాడు. సాధన ఇన్ఫినిటీ ఇంటర్నే షల్ స్కూల్‌కు చెందిన సందీప్ 50మీ. బ్యాక్‌స్ట్రోక్, 4/50 మీ. మెడ్లీలో రన్నరప్‌గా నిలిచి రెండు రజతాలను దక్కించుకున్నాడు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సిద్ధార్థ మూడు కాంస్యాలు, ఒక రజతాన్ని సాధించాడు. 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్, 50మీ. ఫ్రీస్టయిల్, ఫ్రీస్టయిల్ రిలేలో మూడోస్థానంలో నిలిచిన సిద్ధార్థ... 4/50 మీ. మెడ్లీ రిలేలో రజతాన్ని గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment