బడ్జెట్ సమావేశాలు దారుణం: చాడ
Published Fri, Mar 24 2017 1:35 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
హైదరాబాద్: రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అత్యంత దారుణంగా సాగుతున్నాయి. ధర్నా చౌక్‌ని నియంత్రిచడం కేసీఆర్ నియంత పరిపాలనకు సంకేతమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ లాంటి జాతీయ పార్టీలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అనేక భూములు అన్యాక్రాంతం అయినా పట్టించుకునే నాధుడు లేడు. బండ్లగూడలో దేవాలయ భూములు అమ్ముకుంటున్నా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది.
ఈ విషయంపై సర్కార్ వివరణ ఇవ్వాలి. భూముల పరిరక్షణను భూ సంరక్షణ చట్టంను మరింత కఠినతరం చేయాలి. అటవీ భూముల చట్టం 2006 పై క్లారిటీ ఇవ్వాలి. పోడు భూములను సాగుచేసే గిరిజనులపై పీడీ యాక్ట్ పెట్టి వారిని చిత్రహింసలకు గురిచేయడం బాధాకరం. కేసీఆర్‌కు కమ్యూనిస్టుల గురించి మాట్లాడే అర్హత లేదు. మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని ఎన్నికలకు ముందు చెప్పిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ల పేరిట వారిని పొట్టన పెట్టుకుంటోందని’’ ఆరోపించారు.
Advertisement