జమ్మికుంటలో పత్తికి అత్యధిక ధర
Published Tue, Oct 18 2016 12:41 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో కొత్త పత్తికి అత్యధిక ధర పలికింది. మంగళవారం మార్కెట్‌కు వచ్చిన పత్తిని వ్యాపారులు క్వింటాలు రూ.5,340 చొప్పున అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. ఇంత ధర ఏ సీజన్‌లోనూ పలకలేదని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలోనే ఇది అత్యధికమని వెల్లడించారు. మంగళవారం మార్కెట్‌కు వచ్చిన సుమారు వెయ్యి మంది రైతులు 3,500 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు.
Advertisement
Advertisement