హైదరాబాద్‌కు తొలి సర్వీసు రాక
శంషాబాద్: వాషింగ్టన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త. అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా 104 తొలి సర్వీసు శనివారం ఢిల్లీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఇక్కడికి వచ్చిన సర్వీసు తిరిగి దేశీయ సర్వీసుగా మారనుంది. ఇది సోమవారం, గురువారం, శనివారం ఢిల్లీ విమానాశ్రయం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు వాషింగ్టన్ నుంచి వచ్చే ప్రయాణికులు ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి మరో విమానం ద్వారా హైదరా బాద్ చేరుకోవాల్సి ఉండేది.
ప్రస్తుత సర్వీసుతో ప్రయా ణికులు తమ కస్టమ్స్, ఇమిగ్రేషన్ ప్రక్రియను సైతం శంషాబాద్ విమానాశ్రయంలోనే పూర్తి చేసుకోవచ్చు. దక్షిణ భారత దేశానికి ముఖద్వారంగా ఉన్న హైదరాబా ద్‌కు అంతర్జాతీయ సర్వీసులు పెరగడం హర్షణీయమని ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిషోర్ అన్నారు. అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన వాషింగ్టన్ నగరం నుంచి హైదరాబాద్‌కు నేరుగా సర్వీసులు ప్రారంభం కావడంతో తెలంగాణ ప్రాంత ప్రయాణికులకు అనువుగా మారింద న్నారు. త్వరలో ప్రయాణికులకు శ్రీలంక టూరిజం సంబంధించి కూడా సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు.