!['భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో ఢిల్లీ ఫలితం పునరావృతం' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71403768172_625x300_0.jpg.webp?itok=qePl0PEk)
'భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో ఢిల్లీ ఫలితం పునరావృతం'
నల్లగొండ: ఢిల్లీ ప్రజల తీర్పు పాలకుల నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన రెఫరెండంగా భావించాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు అవినీతి, ప్రలోబాలకు లొంగకుండా స్పష్టమైన తీర్పు నివ్వడం అభినందనీయమన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఫలితాలు కనువిప్పులాంటివని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో సంప్రదాయ రాజకీయ పార్టీలకు మరిన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ఇలాంటి గుణపాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.