ఎడ్‌సెట్‌కు హాజరైన విద్యార్థులు అగచాట్ల మధ్యనే తమ పరీక్షను ముగించారు. జిల్లా వ్యాప్తంగా 28 సెంటర్లలో జరిగిన ఎగ్జామినేషన్‌కు 11,886 మంది హాజరయ్యారు. పలు కేంద్రాల్లో ఏర్పాట్లు సరిగ్గా లేక పోవడంతో ఉక్కపోత ఇక్కట్ల పాల్జేసింది. కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన వారితో బస్టాండ్లు కిటకిటలాడాయి.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం,/ వనపర్తిటౌన్,న్యూస్‌లైన్ : బీఈడీ కోర్సులో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పాలమూరు,వన పర్తి పట్టణాల్లో కలిపి 28 కేంద్రాల్లో కలిపి 11886 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. మహబూబ్‌నగర్‌లో జిల్లా కో ఆర్డినేటర్లు డాక్టర్ బషీర్‌అహ్మద్, ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ తహసిన్‌సుల్తాన పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని 23 పరీక్షా కేంద్రాల్లో 10,640 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 9,912 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన అభ్యర్థులు, వారి బంధుగణంతో మహబూబ్‌నగర్ లో రద్దీ కనిపించింది. తల్లులు పరీక్షకు వెళ్లడంతో వారి తండ్రులు, అమ్మమ్మ, నాన్నమ్మలు పిల్లలను ఆడించడం కనిపించింది. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల వద్ద పోలీసుల పర్యవేక్షణ లోపించింది. అభ్యర్థులు లోపలికి వెళ్లే వరకు మాత్రమే పోలీసులు కేంద్రం వద్ద ఉండి బయటికి వెళ్లి పోయారు. కేంద్రం ఎదుట ఉంచిన కొన్ని వాహనాల డిక్కీల నుంచి సెల్‌ఫోన్‌లు గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. మళ్లీ పరీక్ష పూర్తయిన తర్వాతా పోలీసులు కేంద్ర వద్ద కనిపించడం గమనార్హం.
వనపర్తిలో ప్రశాంతం:
ఎడ్‌సెట్ ప్రవేశానికి గాను నిర్వహించిన అర్హత పరీక్ష శుక్రవారం వనపర్తిలో ప్రశాంతగా ముగిసింది. ఐదు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2090 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకోకగా 1974 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలను వనపర్తి ఎడ్‌సెట్ సిటీ కో ఆర్డినేటర్ ఎం. కృష్ణ పరీక్షలు జరుగుతున్న తీరునూ పరిశీలించారు. వనపర్తిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 366 మంది అభ్యర్థులను ఆలట్‌మెం ట్ చేయగా, 340 హాజరయ్యారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 495 మంది అభ్యర్థులకు గాను 470 మంది హాజరయ్యారు. చాణిక్య ఉన్నత పాఠశాలలో 484కు గాను 469మంది, గాయిత్రీ డిగ్రీ కళాశాలలో 360కిగాను 328, బాలికోన్నత పాఠశాలలో 400 మందికి గాను 378 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఉక్కపోతతో అవస్థలు
పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్‌లు లేకపోవడంతో పరీక్షలు రాసే అభ్యర్థులు ఉక్కపోత భరించలేక తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. కొందరికి సెంటర్‌ల పేరు తప్పుగా నమోదు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు గృహిణులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో చంటి పిల్లలను పరీక్ష కేంద్రాల వద్ద సంరక్షులు లాలించడం కనిపించింది.
ఎడ్‌సెట్..ఫీట్లు..!
Published Sat, May 31 2014 2:52 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement