- త్వరలో టీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో పురోభివృద్ధికి వీలుగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ద్వారా సమీకరించాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుం ది. మే 23, 24ల్లో చెన్నైలో జరిగే ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి 3 వేల మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారని తమిళనాడు పరిశ్రమల మంత్రి పి.తంగమణి తెలిపారు.
గురువా రం హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆయ న మాట్లాడారు. కాగా, హైదరాబాద్‌లో త్వరలోనే తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ సంగీతా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సురానా ఇండస్ట్రీస్ అధినేత దేవేంద్ర సురానా, బాబు థామస్ (హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్), ఇలాంజెళియన్ (సన్‌మినా)తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.