ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, దహెగాం(సిర్పూర్): అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఉద్యోగులు, అధికారులు ఎవరైనా అభ్యర్థి, ఏదైన పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఎన్నికల సంఘం వేటు వేస్తుంది. ఉద్యోగులు విధులకే పరిమితం కావాలే గానీ.. ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయొద్దని ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు విధించింది. వాట్సాప్, ఫేస్‌బుక్ పోస్టుల్లోనూ అభ్యర్థులకు మద్దతుగా వ్యాఖ్యాలున్నా ప్రమాదమే.. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో వ్యతిరేకంగానో ఉంటూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ప్రచార మాధ్యమాల వీడియోల ద్వారా ఎవరైన చిత్రీకరించి ఎన్నికల సంఘానికి లేదా అందుబాటులో ఉన్న యంత్రాంగానికి పంపినా ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరుకావడం, ఇష్టారీతిగా మాట్లాడడం, పరనింద, ప్రభుత్వ పథకాలపై నిందలు మోపడం వంటి చర్యలకు దిగే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇటీవల బెజ్జూర్ మండలంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడ్డ విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల్లారా తస్మాత్.. జాగ్రత్త.
Comments
Please login to add a commentAdd a comment