హన్మకొండ : విద్యుత్ వినియోగదారులపై భారం మోపేందుకు ఎన్పీడీసీఎల్ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ సంస్థ లోటును పూడ్చుకునేందుకు చార్జీలు పెంచే టారిఫ్ రేట్లను రూపొందించి టీఎస్ ఈఆర్‌సీకి పంపింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత టారిఫ్ రేట్లపై ప్రజాభిప్రాయ సేకరణను గురువారం హన్మకొండలోని జెడ్పీ సమావేశపు హాల్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సేకరించనుంది. కాగా, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీనివాస్, ఎల్.మోహన్‌రెడ్డి వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు.
చార్జీల పెంపుపై వ్యతిరేకత..
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెలుగు చూసినప్పటి నుంచి వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాగా, ఈ అంశాన్ని వినియోగదారుల సంఘాలు కూడా నిరసిస్తున్నాయి. గతంలోను ఇలాగే ప్రజాభిప్రాయాలు సేకరించినా యధావిధిగా చార్జీలను పెంచారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏటా విద్యుత్ సంస్థల ఆదాయ, వ్యయాలను పరిశీలించిన తర్వాత చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణీత సమయంలో డిస్కంలు ప్రతిపాదనలు పంపించకుంటే రెగ్యులేటరీ కమిటీ తానే స్వయంగా ఎంత మేరకు పెంచాలో నిర్ణయం తీసుకొంటుంది. అయితే రాష్ట్రంలోని డిస్కంలు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు పెంపు అవకాశం ఇవ్వకుండా డిస్కంలే చార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాయి.
వీటిపై రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. ఇదిలా ఉండగా, 2014-2015లో విద్యుత్ సరఫరా వ్యయం రూ.6,547.17 కోట్లు కాగా, 2015-2016లో రూ.7,598.95 కోట్లకు పెరగనుందని అంచనా వేశారు. అలాగే ఆదాయం 2014-2015లో రూ. 3,144.67 కోట్లు ఉండగా, 2015, 2016 సంవత్సరానికి రూ. 3,546.83 కోట్లకు పెరుగనుందని అంచనా వేశారు. దీంతో రూ.4052.12 లోటు ఏర్పడనుందని అంచనా వేశారు. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు పెంపు ప్రతిపాదనలను ఎన్పీడీసీఎల్ సిద్ధం చేసింది. కాగా, తాజా పెంపు ప్రతిపాదనలతో ఎన్పీడీసీఎల్ పరిధిలో దాదాపు రూ.300 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఇదిలా ఉండగా, రెగ్యులేటరీ కమిషన్ ఎదుట నిరసన తెలిపేందుకు వినియోగదారులు సిద్ధమయ్యారు.
చార్జీల పెంపు..
ప్రస్తుతం చార్జీలను కొంత మేరకు పెంచాలని టీఎస్ ఎన్‌పీడీసీఎల్ ప్రతిపాదించింది. నెలకు 50 నుంచి 100 యూనిట్లలోపు వాడుకునే వారికి చార్జీలను పెంచలేదు. 100 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగంపై స్వ ల్ఫంగా 4 శాతం, 200 యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించే గృహ వినియోగదారులపై ప్రస్తుత చార్జీల కన్నా 5.75 శాతం మేరకు పెంచేందుకు సంస్థ ప్రతిపాదించింది. ఎల్‌టీ-2 కేటగిరీలో గృహేతర, వాణిజ్య, ఎల్‌టీ-3 కేటగిరీలో పరిశ్రమలు, ఎల్-4 కేటగిరీలో కుటీర పరిశ్రమల వినియోగంపై ప్రస్తుతం ఉన్న చార్జీలకన్నా 5.75 శాతం హెచ్చిస్తూ ప్రతిపాదించింది.
ఎల్‌టీ-5 కేటగిరీలో వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాలకు, పంచాయతీలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, ఎల్‌టీ-7 కేటగిరీలో సాధారణ విద్యుత్ వాడకం, ప్రార్థనా ప్రాంగణాలు, ఎల్‌టీ-8 కేటగిరీలో తాత్కాలిక వినియోగం కింద వాడకమయ్యే విద్యుత్ చార్జీలను కూడా 5.75 శాతం పెంచాలని ప్రతిపాదించింది. హెచ్‌టీ-1 కేటగిరీ కింద పరిశ్రమలు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల కాలంలో వినియోగించిన విద్యుత్‌కు అదనంగా యూనిట్‌కు రూ.1 చొప్పున టీఓడీ చార్జిని విధించాలని కూడా ప్రతిపాదించింది. అయితే పెంపులో వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ప్రస్తుతం ఉన్న చార్జీలను యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించింది.
పెరుగుదల ఇలా....
గృహ వినియోగంపై...
యూనిట్లు {పస్తుతచార్జీ ప్రతిపాదిత చార్జి
0-101 2.60 2.70
101 నుంచి 200 3.60 3.75
200 యూనిట్లు ఆపైన....0-50 2.60
2.75 51-100 3.25
3.44 101-150 4.88
5.16 151-200 5.63
5.95 201-250 6.38
6.75 251-300 6.88
7.28 301-400 7.38
7.80 401-500 7.38
8.33 500 ఆపైన 7.88
8.86
గుండె గు‘బిల్లు’!
Published Thu, Mar 12 2015 1:14 AM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM
Advertisement
Advertisement