జడ్జీల క్వార్టర్లలో నిర్మించాలని కేసీఆర్ సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కోసం కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థలాల కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుత ం ఉన్న క్యాంపు కార్యాలయంపై సీఎం కేసీఆర్ తొలి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయ నివాస భవనాన్ని శాసనసభ స్పీకర్‌కు, క్యాంపు కార్యాలయాన్ని శాసనమండలి చైర్మన్‌కు కేటాయించాలని యోచి స్తున్నారు. క్యాంపు కార్యాలయం వాస్తురీత్యా బాగా లేదని భావించి కుందన్‌బాగ్‌లో మూడు క్వార్టర్లను కూల్చి అక్కడ కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాలని భావించారు. అందుకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, ఆ తర్వాత సీఎం ఆ ఆలోచనను విరమించుకుని గ్రీన్‌ల్యాండ్స్‌లోని సీఎం కార్యాలయంలో నివాస భవనాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అనంతరం జూన్ 22న ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయంలోకి మారారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉన్న జడ్జీల క్వార్టర్లలో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఇందులో నివాసం, కార్యాలయం, సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి వీలుగా నిర్మాణం ఉండాలని సూచించినట్టు తెలిసింది. సీఎంకు వాస్తుపై ఉన్న నమ్మకం కారణంగానే.. ప్రస్తుత క్యాంపు కార్యాలయంపట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
సీఎంకు కొత్త క్యాంపు ఆఫీస్?
Published Thu, Sep 4 2014 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement