హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర కొత్త ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం సందర్శించారు. ఆసుపత్రిలోగల మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల గురించి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం స్వైన్‌ప్లూ వార్డులోని రోగులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... స్వైన్ ఫ్లూ వల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. 10 రోజుల తర్వాత మరోసారి అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి తో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.