సాగుపై కంపెనీల ఆధిపత్యం!
‘కాంట్రాక్టు వ్యవసాయం’పై అభిప్రాయం కోరుతూ రాష్ట్రానికి కేంద్రం లేఖ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో కంపెనీల ఆధిపత్యానికి అడుగులు పడనున్నా యా? సన్న, చిన్నకారు రైతులను బడా కంపె నీలు తమ గుప్పిట్లోకి తీసుకోనున్నాయా? కేంద్రం తీసుకురానున్న ‘మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్–2017’ ముసాయిదాలోని అంశాలు చూస్తే ఇవి నిజమేనని అంటున్నారు కొందరు రైతు సంఘాల నేతలు. ఈ ముసా యిదాపై రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయా లు, సలహాలు కోరుతూ కేంద్ర వ్యవసాయ సహకార శాఖ తాజాగా లేఖ రాసింది.
కేంద్రం అంచనా ప్రకారం దేశంలో 22.50 శాతం రైతులు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నారు. దేశంలో రైతు కుటుంబ నెలసరి ఆదాయం సగటున రూ.6,426 మాత్రమే ఉందని ముసా యిదాలో ప్రస్తావించారు. 52 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, ఒక్కో వ్యవసాయ కుటుంబ అప్పు సగటున రూ.47 వేలుగా ఉందని ముసాయిదా వెల్లడించింది. ఈక్రమంలో 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా తీసుకొ స్తుందే కాంట్రాక్టు వ్యవసాయ చట్టమంటున్నారు.
కాంట్రాక్టు వ్యవసాయ ఉద్దేశం ఏంటి?
కేంద్ర ముసాయిదా ప్రకారం.. రైతు పంటకు ఏర్పాట్లు చేసుకున్నప్పట్నుంచీ ఆ పంట చేతికి వచ్చేవరకు కంపెనీకి, రైతుకు మధ్య ఒప్పందం ఉంటుంది. సీజన్ మొదట్లో రైతుల కు అవసరమైన సాయాన్ని కంపెనీలు అంద జేస్తాయి. సలహాలు సూచనలు ఇస్తాయి. పంట పండించాక రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. కంపెనీలు గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి.
పంట పండించే క్రమంలో జోక్యం చేసుకుంటాయి.అయితే కంపెనీల విశ్వసనీ యత ఏంటనేది రైతు నేతల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. అలాగే కంపెనీలు మొదటి నుంచి గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల ఆధిపత్యం పెరగడం వల్ల ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోని పరిస్థితులు ఏర్పడుతాయని, దీంతో అన్నదాతకు సరైన న్యాయం దక్కదని అంటున్నారు.