హైదరాబాద్: వేగంగా వెళ్తున్న రెండు బైక్‌లు ఢీ కొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు..ఎర్రకుంట సమీపంలో రోడ్డుపై వెళ్తున్న స్ప్లెండర్, ఆక్టివా వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మక్‌సూద్(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు వసీం పరిస్థితి విషమంగా ఉంది.
వసీంను మెరుగైన వైద్యం కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.