'శ్రీశైలం' నుంచి వెనక్కు తగ్గం: పోచారం
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విషయంలో వెనక్కు తగ్గబోమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తమ రాష్ట్రం, తమ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.
తమ రైతుల ప్రయోజనాలు నెరవేరేదాకా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ చేయలేని పనులు కొద్దీ రోజుల్లోనే తాము చేస్తున్నామన్న విషయాన్ని ఆ పార్టీల నాయకులు గుర్తించాలని సూచించారు.