రేవంత్‌ భద్రత కేసు 29కి వాయిదా | Revanth Reddy security case Postponed to 29th of October | Sakshi
Sakshi News home page

రేవంత్‌ భద్రత కేసు 29కి వాయిదా

Published Sat, Oct 27 2018 3:14 AM | Last Updated on Sat, Oct 27 2018 3:14 AM

Revanth Reddy security case Postponed to 29th of October - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు విషయంలో దాఖలైన వ్యాజ్యంపై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. అధికార పార్టీ నుంచి ప్రాణ హాని  ఉందంటూ భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈసీ గడువు కోరగా అందుకు హైకోర్టు అనుమతించింది. శుక్రవారం రేవంత్‌రెడ్డి వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వెంకట శేషసాయి విచారించారు.

తనకు 3+3 భద్రత ఉండేదని, రాష్ట్రం ఏర్పడ్డాక 2+2కి తగ్గించారని, అధికార పార్టీ నుంచి ప్రాణహాని ఉన్నం దున.. 4+4 భద్రత కల్పించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని హైకోర్టును రేవంత్‌ కోరారు. విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏదో చెప్పబోగా, పిటిషనర్‌ న్యాయవాది కల్పించుకుని ఈ కేసుతో రాష్ట్రానికి సంబంధం లేదని అభ్యంతరం తెలపడంతో ఆయన నిరసన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement