ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) : ఘట్‌కేసర్ మండలంలో స్కూలు విద్యార్థి కనిపించకుండాపోయాడు. ఈదులాబాద్ గ్రామంలోని హోలీ ఫెయిత్ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్న కె.బాలు ప్రసాద్(13) బుధవారం స్కూలుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవటంతో గురువారం ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.