వికారాబాద్ : గులాబీ దండులో అసమ్మతి రాజుకుంటోంది. వికారాబాద్ టీఆర్‌ఎస్‌లో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా శ్రేణులు స్థానిక ఎమ్మెల్యేపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. నామినేటెడ్ పదవుల నియామకంలో, కాంట్రాక్ట్ పనుల్లో ఉద్యమ నాయకులను, సీని యర్లను విస్మరించి.. జూనియర్లకు పెద్దపీట వేస్తున్నారంటూ సంజీవరావు తీరుపై మండిపడ్డాయి. బుధవారం అసమ్మతివర్గ నేతలంతా కలిసి స్థానికంగా ఉన్న ఓ ఫాంహౌస్‌లో రహ స్య సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ విషయాన్నింటిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చింనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సత్తాచాటింది. అన్ని ఎంపీపీ స్థానాలను సైతం కైవసం చేసుకోవడం తో పాటు ఎమ్మెల్యేగా సంజీవరావు విజయం సాధించారు.
ఎమ్మెల్యేపై మొదలైన వ్యతిరేకత..
కాగా.. కొన్ని కారణాంతరాల వల్ల ఎమ్మెల్యేపై నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి టీఆర్‌ఎస్ నేతల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. దీనిపై తాడోపేడో తేల్చుకోవడానికి వారంతా సిద్ధమయ్యారు. పట్టణంలోని నాగేష్ గుప్తా గార్డెన్‌లో బుధవారం సాయంత్రం ఐదు మండలాల సీనియర్ నాయకులతో పాటు, కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పట్టణ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. సంజీవరావు తీరుపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ఎమ్మెల్యే తనతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన ఒకరిద్దరు నాయకులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, సీనియర్లను దూరం పెడుతున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. తెలంగాణ సాధన కోసం ఆది నుంచి ఉద్యమంలో కష్టపడిన నాయకులను పట్టించుకోకుండా పూర్తిగా విస్మరిస్తున్నారని దుయ్యబట్టినట్లు తెలిసింది.
5 వేల మందితో బహిరంగ సమావేశం..?
పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపించిన నాయకులను పూర్తిగా దూరం పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఒక సామాజికవర్గం వైపు మొ గ్గు చూపుతూ తక్కిన వారిని పట్టించుకోవడంలేదన్నట్లు తెలిసింది. అలాగే నామినేటెట్ పదవులతో పాటు, సంస్థగత పదవులను కూడా ఆయన అమ్ముకున్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రం, పాలమూరు ఎత్తిపోతలపై విమర్శలు చేస్తుంటే వారికి సమాధానం ఇచ్చే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే లేరని తెలిసింది. త్వరలో వికారాబాద్‌లో 5 వే ల మందితో బహిరంగంగా సమావేశమై ఎమ్మెల్యే తీరును బయ ట పెట్టాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ అధిష్టానం వికారాబాద్ ఎమ్మెల్యే అసమర్థతను గుర్తించి నియోజకవర్గానికి ఇన్‌చార్జిని నియమించాలని తీర్మానించినట్లు సమావేశంలో వెల్లడైనట్లు తెలిసింది. ఎమ్మెల్యే తీరుపై త్వరలోనే ఎంపీ, మంత్రులతో పాటు రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసి పరిస్థితులను విన్నవించేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
‘గులాబీ’లో అసమ్మతి!
Published Thu, Oct 22 2015 1:49 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement