వెంటాడి.. వేటాడి..
కనగల్ :కనగల్ మండలం చిన్నమాదారం గ్రామ పరిధిలోని కుమ్మరిగూడెంలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. హతులు నల్లగొండకు చెందిన ఎస్‌కే గౌసొ ద్దీన్(35), బొంద రవికుమార్ (36)గా పోలీసు లు గుర్తించారు. నిందితులు పదునైన ఆయు దాలతో దాడి చేసి అతి కిరాతకంగా గొడ్డలిలో నరికి చంపారు. కళ్లలో కారం కొట్టి మెడ, ము ఖంపై విచక్షణారహితంగా గొడ్డలితో నర కడంతో రక్తపుమడుగులో కొట్టుకుంటూ అ క్కడికక్కడే మృతిచెందారు.నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది.
జిల్లా కేం ద్రానికి చెందిన ఎస్‌కే గౌసొద్దీన్ కనగల్ మం డలం కుమ్మరిగూడేనికి చెందిన మల్లికంటి వెం కన్న అలియాస్ వెంకటేశ్వర్లుకు మూడేళ్ల క్రితం రూ. 6 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే వెం కన్న ఫైనాన్స్ ఎత్తివేయడంతో తన డబ్బులు ఇవ్వాలని గౌసొద్దీన్ ఒత్తిడి పెంచసాగాడు. ఈ నేపథ్యంలో వెంకన్న రూ. 4లక్షల వరకు గౌసొ ద్దీన్‌కు ముట్టజెప్పాడు. మిగతా డుబ్బు ఈ నెల 5వ తేదీన చెల్లించేలా ఒప్పందం కుదుర్చు కున్నారు. దీంతో గౌసొద్దీన్ రామగిరికి చెందిన తన స్నేహితుడు రవికుమార్‌తో కలిసి ఉదయం బైక్‌పై కుమ్మరిగూడేనికి వచ్చారు. అయితే డ బ్బుల విషయంలో వెంకన్నకు గౌసొద్దీన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వెంకన్న అతడి తండ్రి రాములు, సోదరుడు యాదగిరి కలిసి గొడ్డళ్లు ఇతరత్రా ఆయుధా లతో గౌసొద్దీన్, అతడి స్నేహితుడు రవికుమా ర్‌పై దాడిచేశారు. దీంతో వారు అక్కడి కక్కడే మృతిచెందారు.
విషయం బయటకు పొక్క క ముందే నిందితులు అక్కడి నుంచి పరార య్యా రు. ఇరుగుపొరుగు వారు చూసి పోలీసు లకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని డీఎ స్పీ రాంమోహన్‌రావు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనగ ల్ మండలం కుమ్మరిగూడెంలో మంగళవారం జరిగిన దారుణ హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెం దిన గౌసొద్దీన్ ఫైనాన్స్ నిర్వాహకుడైన కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన వెంకన్నకు మూ డేళ్ల క్రితం 6 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తదనంతరం నాలుగు లక్షల రూపాయలను వెంకన్న చెల్లించాడు. మిగతా రెండు లక్షల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకన్న పథకం ప్రకారం గౌసొద్దీన్‌ను కుమ్మరిగూడేనికి పిలిపించి తన సోదరుడు, తండ్రితో కలిసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
పథకం ప్రకారమే..
జంట హత్యలు పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫైనాన్స్ నిర్వాహకు డు వెంకన్నతో పాటు అతడి తండ్రి రాములు, తమ్ముడు యాదగిరి హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట ప్రాంతంలో హత్యలు జరిగినట్లు తెలిపారు. పదునైన ఆయుధాలు సిద్ధం చేసుకుని హతమార్చేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. మొదట పెనుగులాట జరి గిన అనంతరం ఇంట్లోనే గౌసొద్దీన్ కళ్లలో కా రం చల్లి వెంకన్న అతడి తండ్రి, తమ్ముడు కలిసి గొడ్డలితో మెడ, ముఖంపై బలంగా నరకడంతో రక్తపు మడుడుతో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. గమనించిన గౌసొద్దీన్ స్నేహితుడు రవికుమార్ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెత్తగా సుమారు కిలోమీటర్ వెంటాడి కిరాతకంగా నరికి చంపారు.
మృతుల కుటుంబాల్లో విషాదం
ఇరువురు హత్యకు గురికావడంతో మృతుల కుటుం బాల్లో విషాదం అలముకుంది. హతులు గౌసొద్దీన్, రవికుమార్‌లు స్నేహితులు. ఇద్దరు హీరోహోండా షోరూంలో గౌసొద్దీన్ మోకానిక్‌గా, రవికుమార్ స్పేర్‌పార్ట్స్ విక్రయం వద్ద పనిచేశారు. రెండు సంవత్సరాల క్రితం గౌసొద్దీన్ షోరూంలోంచి బయటకు వచ్చి సొంతంగా జిల్లాకేంద్రంలోని రామగిరిలో బైక్ మోకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు.సంవత్సరం క్రితం గౌసొద్దీన్‌కు వివాహం అయింది. రవికుమార్ సైతం షోరూంలోంచి బయటకు వచ్చి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా గౌసొద్దీన్ స్వ గ్రామం తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామం. పది సంవత్సరాల క్రితం నుంచి నల్లగొండలో స్థిరపడ్డాడు.