ఘనంగా ఉగాది వేడుకలు
పూజలు చేసిన భక్తులు
డోర్నకల్: ఉగాది పండుగను పురస్కరించుకుని పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో శుక్రవారం శ్రీదుర్మిఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఇళ్లలో పూజలు జరుపుకుని ఉగాది పచ్చడి పం పిణీ చేశారు. సాయంత్రం వెంకటేశ్వరాలయం, ఆంజనేయస్వా మి ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వరాలయంలో ఆలయ అర్చకులు మేడూరి రామాచార్యులు రాశుల వారీగా పంచాంగాన్ని చదివి వినిపించారు. రెండు ఆలయాల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు.
మరిపెడలో..
మరిపెడ: తెలుగు సంవత్సరాది సందర్భంగా మండలంలోని పలు దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో దుర్మిఖీనామ సం వత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి. పంచాంగ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు తల్లాడ వెంకట్రామారావు, తోట సతీష్, దారం సోమయ్య, తల్లాడ సురేష్ పాల్గొన్నారు.
నర్సింహులపేటలో..
నర్సింహులపేట: మండలంలో శుక్రవారం ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దుర్మిఖి నామ సంవత్సరంలో పండుగ రోజున ఉదయం నుంచే ప్రతీ ఇంటి ముంగిట మామిడి తోరణాలతో అలంకరించారు. ఉగాది పచ్చడి తయూరు చేసుకొ ని తాగారు. సాయంత్రం ఆలయాల్లో నూతన పంచాంగాన్ని చది వి వినిపించారు. శివాలయంలో అచార్యులు దేవేందర్‌శర్మ, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనందనాచార్యలు, శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో కుమారాచార్యులు, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో మంచాల కేశవగుప్తా వద్ద రైతులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పంచాగం చూపెట్టుకున్నారు.
వీరభద్రస్వామి ఆలయంలో..
కురవి: తెలుగు ప్రజలకు నూతన సంవత్సర పండువ ఉగాది ఘనంగా మండంలోని అన్ని గ్రామాల ప్రజలు నిర్వహించారు. కురవిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చక స్వాములు ఉగాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రవణాన్ని ఆలపించారు. పెద్దలు, భక్తులు ఈ పంచాంగ పఠాన్ని ఆలకించారు. అలాగే ఉదయం టీఆర్‌ఎస్ నాయకులు డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వద్దకు వెళ్లి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.