30, 31 తేదీల్లో ప్రభుత్వ ‘బిజినెస్’ జరిపే బ్యాంక్ బ్రాంచ్‌లు పనిచేస్తాయ్ | 30, 31 on the 'business' of either bank branches working | Sakshi
Sakshi News home page

30, 31 తేదీల్లో ప్రభుత్వ ‘బిజినెస్’ జరిపే బ్యాంక్ బ్రాంచ్‌లు పనిచేస్తాయ్

Published Thu, Mar 26 2015 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

30, 31 తేదీల్లో ప్రభుత్వ ‘బిజినెస్’ జరిపే బ్యాంక్ బ్రాంచ్‌లు పనిచేస్తాయ్

30, 31 తేదీల్లో ప్రభుత్వ ‘బిజినెస్’ జరిపే బ్యాంక్ బ్రాంచ్‌లు పనిచేస్తాయ్

ముంబై: ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల బ్రాంచీలు అన్నీ ఈ నెల 30, 31 తేదీల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అన్ని బ్యాంకులకూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మార్చి 30న బ్యాంకులు పూర్తి రోజు పనిచేస్తాయి. 31వ తేదీన రాత్రి 8 గంటల వరకూ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కౌంటర్లు తెరిచి ఉంటాయి.

ఆర్థిక సంవత్సరం పూర్తి అయిన రోజే, ఆ ఏడాదికి సంబంధించిన ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తికావడానికి వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్ పేర్కొంది. మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఎలక్ట్రానిక్ లావాదేవీలు కొనసాగుతాయని తెలిపింది. ఈ సౌలభ్యం విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సైతం బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement