ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపండి: బొత్స సత్యనారాయణ | Antony committee to be sent for state bifurcation : Botsa satyanarayana | Sakshi
Sakshi News home page

ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపండి: బొత్స సత్యనారాయణ

Published Mon, Sep 30 2013 1:37 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపండి: బొత్స సత్యనారాయణ - Sakshi

ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపండి: బొత్స సత్యనారాయణ

సోనియాగాంధీకి పీసీసీ చీఫ్‌ బొత్స లేఖ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంటోనీ కమిటీ సభ్యులను హైదరాబాద్‌కు పంపాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఆదివారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నోట్‌ కేంద్ర కేబినెట్‌ ముందుకు రాకముందే కమిటీ సభ్యులను రాష్ట్రానికి పంపాలని కోరారు. ఆంటోనీకి ఆరోగ్యం బాగోలేనందున.. ఆ కమిటీకి చెందిన సభ్యులు షిండే, మొయిలీ, దిగ్విజయ్‌లను హైదరాబాద్‌కు పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు పేజీల లేఖను కాంగ్రెస్‌ అధినేత్రికి పంపారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఉద్యమం విస్తరించిందని, ముఖ్యంగా ఉద్యోగులు ఆందోళనను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి విశ్వరూప్‌ గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని పంపడంతోపాటు పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరారని, మరో ఎంపీ ఎస్పీవై రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement