జీఎస్టీపై అపోహలొద్దు | Central Revenue Secretary Hasmukh Giri on gst | Sakshi
Sakshi News home page

జీఎస్టీపై అపోహలొద్దు

Published Mon, Jul 3 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

జీఎస్టీపై అపోహలొద్దు

జీఎస్టీపై అపోహలొద్దు

కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముక్‌ అధియా
న్యూఢిల్లీ: తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీపై సామాజిక మాధ్యమాల్లో, ఇతరత్రా ప్రచారమవుతున్న వార్తలపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముక్‌ అధియా స్పందించారు. జీఎస్టీపై వస్తున్న అపోహలకు ఆదివారం ట్విటర్‌ ద్వారా సమాధానమిచ్చారు. ఆ వివరాలు..

అపోహ: ఇప్పటివరకు ఉన్న వ్యాట్‌ కన్నా జీఎస్టీ భారం ఎక్కువ.
అధియా సమాధానం: అలా కన్పిస్తుంది.. కానీ నిజం కాదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రత్యక్షంగా పైకి కనిపించని ఎక్సైజ్‌ ట్యాక్స్, పలు ఇతర పన్నులు.. ఇప్పుడు జీఎస్టీలో కలిసిపోయాయి. దాంతో అవన్నీ కలిపి ఏకమొత్తంగా కన్పిస్తుండటం వల్ల జీఎస్టీ ఎక్కువగా కనిపిస్తోంది.

అపోహ: క్రెడిట్‌ కార్డుల ద్వారా వినిమయ బిల్లులు చెల్లిస్తే...రెండు దఫాలు జీఎస్టీ కడుతున్నట్లు.
సమాధానం: కరెక్టుకాదు. కార్డు లేదా నగదుతో.. ఎలా చెల్లించినా జీఎస్టీ విధింపు ఒకసారే జరుగుతుంది. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు.

అపోహ: ప్రొవిజనల్‌ ఐడీ నంబర్‌తో వ్యాపారం కొనసాగించడం కుదరదు.
సమాధానం:
ప్రొవిజనల్‌ ఐడీ నంబర్‌తోనూ వ్యాపారం కొనసాగించవచ్చు. జీఎస్టీఐఎన్‌ వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అలాగే, ప్రొవిజినల్‌ ఐడీయే ఫైనల్‌ జీఎస్టీఐఎన్‌ నంబర్‌ అవుతుంది.

అపోహ: ఇన్‌వాయిస్‌లు అన్నీ కంప్యూటర్‌ / ఇంటర్నెట్‌ ద్వారానే తీసుకోవాలి.
సమాధానం: ఇన్‌వాయిస్‌లు మాన్యువల్‌గా కూడా తీసుకోవచ్చు.

అపోహ: జీఎస్టీ అమలుతో రిటైలర్లు వ్యాపారం చేసుకోవాలంటే.. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వుండాల్సిందే.
సమాధానం:
నెలవారీ జీఎస్టీ రిటర్న్‌ దాఖలు చేసేటప్పుడు మాత్రమే ఇంటర్నెట్‌ అవసరం.

అపోహ: నెలకు మూడు రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
సమాధానం: ఒక రిటర్న్‌ను దాఖలు చేస్తే చాలు. కానీ అది మూడు భాగాలుగా వుంటుంది. అందులో మొదటి భాగాన్ని డీలరు దాఖలు చేస్తే.. మిగిలిన రెండు భాగాలు కంప్యూటర్‌ ఆటోమేటిక్‌గా జనరేట్‌ చేస్తుంది.

అపోహ: చిన్న వ్యాపారులు కూడా రిటర్న్‌ల్లో ఇన్‌వాయిస్‌ల వారీగా వివరాల్ని దాఖలు చేయాలి.
సమాధానం:
చిన్న వ్యాపారులు ఇన్‌వాయిస్‌ల వారీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అమ్మకాల్ని క్లుప్తంగా ఫైల్‌ చేస్తే చాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement