అమెరికాలో మళ్లీ భారీ కాల్పులు! | Florida Club Blu nightclub shooting, Two dead after 15 revellers shot at teen night event | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ భారీ కాల్పులు!

Published Mon, Jul 25 2016 2:15 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

అమెరికాలో మళ్లీ భారీ కాల్పులు! - Sakshi

అమెరికాలో మళ్లీ భారీ కాల్పులు!

ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫ్లోరిడాలోని ఓ నైట్‌ క్లబ్‌లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో కనీసం ముగ్గురు చనిపోయారని, 17మందికి గాయపడ్డారని తెలుస్తోంది.

ఫ్లోరిడా ఫోర్ట్‌ మెయర్స్‌లోని ‘క్లబ్‌ బ్లూ’లో ‘టీన్ నైట్’ పార్టీ జరిగింది. ఈ పార్టీలో 13 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలలు పాల్గొన్నారు. ఈ బాలలు లక్ష్యంగానే అగంతకులు నైట్‌ క్లబ్బులో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఓ కాల్పుల్లో మృతిచెందిన వారిలో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు.

గతనెలలో ఆర్లాండోలోని గే నైట్‌ క్లబ్బులో ఓ ఉన్మాది కాల్పులు జరిపి.. 50మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఒమర్ మతీన్ అనే ఉన్మాది జరిపిన ఈ నరమేధాన్ని మరువకముందే మరోసారి పిల్లలు లక్ష్యంగా కాల్పులు జరగడం అమెరికావాసులను ఆందోళన పరుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement