బ్రిటన్ విడిచిపెట్టి రాను: మాల్యా
బ్రిటన్ విడిచిపెట్టి రాను: మాల్యా
Published Thu, Feb 23 2017 12:02 PM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగనామం పెట్టి యూకేకు పారిపోయిన విజయ్ మాల్యాను ఎలాగైనా భారత్కు రప్పించాలని ఓ వైపు ఇండియన్ అథారిటీలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుంటే, తనని బ్రిటన్ నుంచి ఇక్కడకు రప్పించలేరని లిక్కర్ కింగ్ చెబుతున్నారు. తాను మాత్రం బ్రిటన్ను విడిచిపెట్టి ఇక్కడికి రానని పేర్కొంటున్నారు. యూకే చట్టాల కిందే తాను సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణాల విషయంలో మోసం, కుట్ర కింద తనపై నమోదైన కేసులను ఆయన కొట్టిపారేశారు. ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగంగా ఖర్చుచేయలేదన్నారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం తనని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
తనను ఎన్నికల ప్రచార సందర్భంగా రెండు అతిపెద్ద పార్టీలు ఓ పొలిటికల్ ఫుట్ బాల్లా ఆడుకుంటున్నాయని ఆరోపించారు. . మాల్యాకు సాయం చేశారంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. తన సివిల్ కేసును సీబీఐ ప్రభుత్వ ఉత్తర్వులతో క్రిమినల్గా కేసుగా మార్చిందని ఆరోపించారు. రుణాలు రికవరీ చేసుకోవడం పూర్తిగా సివిల్ అంశం కిందకు వస్తోంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని క్రిమినల్ గా మార్చింది. ప్రతి దాన్ని తాను లీగల్ గా ఛాలెంజ్ చేసే అవకాశముందన్నారు. తనపై వారు ఎలాంటి కేసు పెట్టలేరని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు మీడియాపై కూడా మాల్యా మండిపడ్డారు. ఫార్ములా 1లోకి ఇండియన్ ఎంట్రీని పొగడాల్సింది పోయి, మీడియా దాన్ని రాద్ధాంతం చేస్తుందని సీరియస్ అయ్యారు. ఇండియన్ మీడియా కామెంట్లు చాలా బాధకరమన్నారు.
Advertisement
Advertisement