‘అగ్లీ పోటీలో అన్యాయం’ | Injustice in the ugly contest | Sakshi
Sakshi News home page

‘అగ్లీ పోటీలో అన్యాయం’

Published Sun, Nov 22 2015 10:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

‘అగ్లీ పోటీలో అన్యాయం’

‘అగ్లీ పోటీలో అన్యాయం’

హరారే: జింబాబ్వే రాజధాని హరారేలో పీజెంట్ అనే పబ్ అందవికారంగా ఉండే వాళ్లకూ పోటీలు నిర్వహించి ‘మిస్టర్ అగ్లీ’ టైటిల్‌తోపాటు 500 డాలర్లు (రూ.33వేలు) నగదు బహుమతి ఇస్తోంది. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు నిరుద్యోగులు, తాగుబోతులు పోటీపడుతుంటారు. ఎప్పటిలాగే ఈసారీ పోటీల్లో చూసేందుకు అందవికారంగా, చిరిగిపోయిన దుస్తులు వేసుకుని నోట్లో పళ్లు  లేని 42 ఏళ్ల మైసన్ సెరె అనే నిరుద్యోగి 200 మందితో పోటీ పడి ‘మిస్టర్ అగ్లీ-2015’ కిరీటాన్ని దక్కించుకున్నాడు.

‘నిరుడు నాలుగో స్థానంలో నిలిచా.. ఈసారి టైటిల్ గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని మైసన్ చెప్పాడు. వరుసగా మూడేళ్లు టైటిల్ గెలుచుకున్న విలియమ్స్ అనే వ్యక్తి.. ఈ సారి రెండో స్థానంలో నిలిచి 100 డాలర్లు (రూ.6600) గెలుచుకున్నాడు. న్యాయనిర్ణేతల వివక్ష వల్లే ఈసారి కిరీటం మిస్సైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement