ఇంఫాల్: మణిపూర్‌లో ఐదు నెలల క్రితం యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎత్తి వేస్తున్నామంటూ ఒక అధికారిక ప్రకటన వెలువడింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, నాగా సంఘాల మధ్య తాజాగా జరిగిన త్రైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రకటనను విడుదల చేశారు.
అరెస్టైన యూఎన్‌సీ నేతలను బేషరతుగా విడుదల చేయడంతోపాటు ఆర్థిక దిగ్బంధనానికి సంబంధించి వారిపై ఉన్న అన్ని కేసులను మూసేసేందుకు ఒప్పందం కుదిరింది. 2016లో అప్పటి ఇబోబీ సింగ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా నవంబరు 1 నుంచి రాష్ట్రంలో యూఎన్‌సీ ఆర్థిక దిగ్బంధనాన్ని విధించింది.
మణిపూర్‌లో ఆర్థిక దిగ్బంధనం ఎత్తివేత!
Published Mon, Mar 20 2017 3:40 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
Advertisement