న్యూఢిల్లీ: క్యాబ్ సేవల రంగంలో ఉన్న మేరు క్యాబ్స్ భారత్‌లో విస్తరిస్తోంది. దీనిలో భాగంగా మేరు క్యాబ్స్ ఏప్రిల్ నాటికి అమెరికా, హాంకాంగ్‌లకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ.625 కోట్లను సమీకరించనుంది. ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ.310 కోట్లను సమీకరించామని మేరు క్యాబ్స్ సీఈఓ సిద్ధార్థ పహ్వా అన్నారు. ప్రస్తుత రూ.625 కోట్ల నిధుల సమీకరణ వచ్చే నెల నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. క స్టమర్ల సంఖ్యను పెంచుకోవటం, ఆటో రిక్షా యూజర్లను ఆకర్షించటం, కొత్త పట్టణాలకు విస్తరించ డం అనే అంశాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. సేకరించిన నిధులను వీటికే వెచ్చిస్తామని అన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో తమ కార్ల సంఖ్యను లక్షకు పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం మేరు క్యాబ్స్ 15,000 కార్లను కలిగి, 20 పట్టణాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
రూ.625 కోట్లు సమీకరించనున్న మేరు క్యాబ్స్
Published Fri, Mar 20 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement