ఆ బుల్డోజర్లు నా శరీరం మీదుగానే వెళ్లాలి | Rahul banner on the demolition of houses for the poor in Delhi | Sakshi
Sakshi News home page

ఆ బుల్డోజర్లు నా శరీరం మీదుగానే వెళ్లాలి

Published Fri, Nov 28 2014 1:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆ బుల్డోజర్లు నా శరీరం మీదుగానే వెళ్లాలి - Sakshi

ఆ బుల్డోజర్లు నా శరీరం మీదుగానే వెళ్లాలి

ఢిల్లీలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాహుల్ ధ్వజం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రంగ్‌పురి పహాడీ మురికివాడల్లోని పేదలకు చెందిన 900 ఇళ్లను ప్రభుత్వాధికారులు కూల్చివేసిన ఉదంతంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఇళ్ల కూల్చివేతల వల్ల నిరాశ్రయులుగా మారిన బస్తీల వాసులను గురువారం రాత్రి రాహుల్ పరామర్శించారు.

‘మరోసారి వారు బుల్డోజర్లను ఉపయోగించదలిస్తే, వాటిని నా శరీరం మీదుగానే ముందుకు పోనివ్వాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు.
పేదల ఇళ్ల కూల్చివేత తప్పు అని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించబోదన్నారు. ఓ పక్క చలికాలం కొనసాగుతోందని, మరోపక్క ఎలాంటి హెచ్చరికలు లే కుండానే పేదల ఇళ్లను కూల్చేసి వారిని బయటికి గెంటేశారన్నారు. అటవీ ప్రాంతాల పునరుద్ధరణ పేరుతో మంగళవారం స్థానిక జిల్లా రెవెన్యూ, అటవీ అధికారులు ఈ కూల్చివేతలను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement