జైరాం రమేష్
న్యూఢిల్లీ: ఎంతో ప్రాముఖ్యత గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను గందరగోళం మధ్య ముందుకు తీసుకువెళ్లడం మంచిది కాదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని ఆయన చెప్పారు.
పార్లమెంటులో బిల్లును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్, యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ నిర్ణయిస్తారని చెప్పారు.