సూర్యలంకలో నలుగురు విద్యార్థుల గల్లంతు
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.
స్ధానిక వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు శుక్రవారం ఉదయం సూర్యలంక తీరానికి వెళ్లారు. సముద్రంలో స్నానానికి దిగగా నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంభొట్లవారిపాలెంకు చెందిన గుడివాడ కృష్ణ్రపసాద్, నల్లగొండ జిల్లాకు చెందిన మహేష్ మృతి చెందగా, తెనాలి పట్టణానికి చెందిన శ్రీనివాస్, గుంటూరుకు చెందిన జైదేవ్ గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో ఆర్ డీఓ నరసింహులు, బాపట్ల తహశీల్దార్, సీఐ శ్రీనివాస్ గాలింపును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి విద్యార్థుల మృతదేహాలను వెలికి తీయించారు. విద్యార్థులంతా మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు.