టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అరెస్టు | TPCC chief uttam kumar reddy arrested | Sakshi
Sakshi News home page

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అరెస్టు

Published Wed, Aug 12 2015 4:34 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అరెస్టు - Sakshi

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అరెస్టు

బెజ్జంకి(కరీంనగర్): తోటపల్లి రిజర్వాయర్ రద్దు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్ రహదారి దిగ్బంధం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం చేపట్టిన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతోంది.

పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఉత్తమ్‌తోపాటు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్ తదితరులను అరెస్టు చేసి, బెజ్జంకి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement