సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్‌ట్రాన్స్‌కో)లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 206 పోస్టుల కోసం 47,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 38,469 (81.41శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఏఈ (ఎలక్ట్రికల్) కేటగిరీలో 184 పోస్టులకు గాను 33,097 మంది(84.66శాతం), ఏఈ (సివిల్) కేటగిరీలో 22 పోస్టులకు గాను 5,372 (65.85శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని 53 పరీక్షా కేంద్రాల్లో రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ట్రాన్స్‌కో మానవవనరుల విభాగం డెరైక్టర్ నర్సింగ్‌రావు తెలిపారు. పరీక్ష ప్రాథమిక కీని సోమవారం ట్రాన్స్‌కో వెబ్‌సైట్‌లో ప్రదర్శన కోసం ఉంచుతామని, 48 గంటల్లో అభ్యంతరాలను తెలపాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. సులువుగా ప్రశ్నలు: గరిష్టంగా 100 ప్రశ్నలకు నిర్వహించిన ఈ పరీక్షలో 80 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్ట్ నుంచి, 20 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్, న్యూమ రికల్ ఎబిలిటీ నుంచి అడిగారు.
అయితే ప్రశ్నల క్లిష్టత స్థాయి మాత్రం గత పరీక్షల కంటే సులువుగా ఉన్నట్లు సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు సంబం ధించి కొమురం భీం జన్మస్థలం? తెలంగాణ మార్చ్ నిర్వహించిన తేది? వరంగల్ కోట నిర్మాణానికి పునాది వేసిన కాకతీయ రాజెవరు? తెలంగాణలో కుతుబ్‌షాహీల కాలంలో షియాలు ప్రముఖంగా జరుపుకున్న పండుగేది? అనే ప్రశ్నలు వచ్చాయి.
ట్రాన్స్‌కో ఏఈ పరీక్షకు 38,469 మంది హాజరు
Published Mon, Nov 30 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement