నవంబర్ నుంచి మహిళా బ్యాంక్ కార్యకలాపాలు
నవంబర్ నుంచి మహిళా బ్యాంక్ కార్యకలాపాలు
Published Thu, Sep 19 2013 2:47 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
న్యూఢిల్లీ: భారత మహిళా బ్యాంక్ కార్యకలాపాలు ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పూర్తిగా మహిళల కోసమే ఉద్దేశించిన ఈ బ్యాంక్ తాజాగా 115 ఆఫీసర్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కావలసిన అర్హతలు.
ఈ ఏడాది అక్టోబర్ 15 కల్లా ఆరు చోట్ల బ్రాంచీలను ఏర్పాటు చేయాలని భారత మహిళా బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ఇండోర్, గువాహటిల్లో ఈ బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు బెంగళూరు, జైపూర్, లక్నో, మైసూర్‌లో కూడా బ్రాంచీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడిని కేటాయించింది. మహిళల బ్యాంకింగ్ అవసరాలు తీర్చడం, ఆర్థిక సాధికారతకు తోడ్పడం లక్ష్యంగా భారత మహిళా బ్యాంక్ ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement