-
రాష్ట్రంలో స్కామ్‌ల పాలన బాధాకరం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా.. స్కాంల పాలన నడుస్తోందని అన్నారాయన. గురువారం సాయంత్రం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘నా పాదయాత్రలో కష్టాలను చూశా. అందుకు తగ్గట్లు.. గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ ఇంటికి మంచి చేశాం. ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాం...కూటమి పాలనలో తిరోగమనంలో ఇప్పుడు రాష్ట్రం ఉంది. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. బడ్జెట్‌తో భరోసా ఇవ్వలేకపోయారు. లిక్కర్, ఇసుక స్కాంలతో పాటు.. ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి..రాష్ట్రంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అడుగులు వెనక్కు పడుతున్నాయి. సూపర్ సిక్స్‌లు కనిపించవు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు కనిపించవు. రెడ్‌బుక్ పరిపాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కనబడుతోంది.’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన:రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ఇప్పుడు అవిఎలా వెనక్కు వెళ్తున్నాయో చెబుతాను. రాష్ట్రంలో ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితులు. ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం. దాని ద్వారా కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు.. ఇవేవీ కనిపించడం లేదు. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ లేదు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన. రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. ప్రతి చోటా దోపిడి. ఒక మాఫియా సామ్రాజ్యం. పైస్థాయి నుంచి కింది వరకు ఎక్కడిక్కడ కమిషన్లు. దోపిడి.కష్టాలు స్వయంగా చూసి..:గతంలో అసాధ్యం అనుకున్న మార్పులు మనం చేసి చూపగలిగాం. మేం తీసుకొచ్చిన ప్రతి మార్పు, నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాక, తీసుకున్న నిర్ణయాల ద్వారా జరిగింది. ప్రతి రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చాం. ఊహించని మార్పులు తేగలిగాం. ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోనూ డోర్ డెలివరీ చేశాం. ఆ విధంగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ. వాలంటీర్ల వ్యవస్థ. దాదాపు 540 రకాల సేవలు అందించాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. ఎక్కడా, లంచాలు, వివక్ష లేదు. క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశాం. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశాం. ప్రతి ఇంటికి మేలు చేశాం. ఈరోజు మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. పథకాల కోత మొదలైంది. ఏ పని కావాలన్నా టీడీపీ నాయకుల ఇళ్లు తిరగాల్సిందే.విద్యా రంగం:బడులు పూర్తిగా మార్చాం. ప్రైవేటుకు థీటుగా వాటిని అభివృద్ధి చేశాం. ఇంగ్లిష్ మీడియమ్‌తో మొదలు పెడితే, సీబీఎస్ఈ, ఐబీ వరకు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. డిజిటల్ క్లాస్‌రూమ్స్. ట్యాబ్‌లు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, పూర్తి ఫీజు చెల్లింపు, అమ్మ ఒడి, మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ మొదలుపెడితే కరికులమ్‌లో మార్పులు. ఇలాంటి విప్లవాత్మక మార్పులన్నీ వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చాయి.వైద్య రంగం:గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఇంటి వద్దనే వైద్యం. విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. 52 వేల పోస్టులు భర్తీ చేసి జీరో వేకెన్సీ తెచ్చాం. రాష్ట్రంలో స్పెషలిస్టుల కొరత కేవలం 4 శాతం. అది జాతీయ స్థాయలో 61 శాతం. 3300 చికిత్సలు ఆరోగ్యశ్రీలో. ఆరోగ్య ఆసరా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు మొదలైంది మా ప్రభుత్వ హయాంలోనే.వ్యవసాయ రంగం:చేయి పట్టుకుని రైతులను నడిపించాం. ఈ–క్రాప్ వ్యవస్థ, ఆర్బీకేలు, దళారుల ప్రమేయం లేకండా పంటల కొనుగోలు. అదే ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనమే. ప్రతి రోజూ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెస్పీ కంటే దాదాపు రూ.400 కంటే తక్కువకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. దళారుల చేతిలోనే అన్నీ.ఫీజు రీయింబర్స్మెంట్:ప్రతి క్వార్టర్ అయిపోగానే, ఫీజులు చెల్లించేవాళ్లం. ఇప్పటికీ మూడు క్వార్టర్లు పూర్తి కాగా, జనవరికి నాలుగు క్వార్టర్లు. ఆ మేరకు పిల్లల ఫీజులు బకాయిలు. కాలేజీల్లో పిల్లలను వెనక్కు పంపుతున్నారు. బడులకు పోయే పిల్లలు పంట పొలాల్లో పని చేస్తున్నారు. రూ.2800 కోట్లు విద్యాదీవెన బకాయిలు. రూ.1100 వసతిదీవెన బకాయిలు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2200 కోట్లు దాటాయి. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 108, 104 సర్వీసులు మూలనబడ్డాయి. వాలంటీర్లను తొలగించారు. వారికి రూ.10 వేలు ఇస్తామని పచ్చిగా మోసం చేశారు. అన్ని వ్యవస్థలు దారుణంగా వెనక్కు పోయాయి. -
నాగ్ పిటిషన్.. కొండా సురేఖకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి! -
విడాకులకు గుడ్‌బై చెప్పి మళ్లీ కలవనున్న జయం రవి, ఆర్తి..?
కోలీవుడ్ నటుడు జయం రవి ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మళ్లీ తన భార్య ఆర్తితో కలిసి జీవించనున్నాడంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఇదే చర్చ జరుగుతుంది. కొన్నాళ్ల పాటు డేటింగ్ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్న జయం రవి, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జోడీ పలు విభేదాలు రావడంతో విడాకుల నోటీసుల వరకు వెళ్లింది.జయం రవి, ఆర్తి విడాకుల కేసు చెన్నై మూడో కుటుంబ న్యాయస్థానంలో జడ్జి తేన్మొళి విచారణ చేశారు. సయోధ్య కేంద్రంలో మధ్యవర్తిత్వానికి హాజరు కావాలని దంపతులను ఆదేశించారు. అక్కడ జయం రవి, ఆర్తి ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. మధ్యవర్తితో పాటు ఒక గంటకు పైగా సాగిన చర్చలో వారిద్దరూ కూడా సానుకూలంగా మాట్లాడినట్లు సమాచారం. ఎలాంటి ఆందోళన లేకుండా తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారట. పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని మధ్యవర్తి ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వారు కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. దీంతో మళ్లీ వారిద్దరూ కలుస్తారంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.ఘీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి మొదటసారి ప్రకటించాడు. అయితే, విడాకుల విషయంలో తన ప్రమేయం లేదని ఆర్తి తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. తన అనుమతి లేకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటి అంటూ జయం రవి నిర్ణయాన్ని తప్పుపట్టింది. కానీ, లాయర్ ద్వారా ఆర్తికి విడాకుల నోటీసు పంపించానని జయం రవి చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఆమె తండ్రికీ కూడా తెలుసని ఆ సమయంలో తెలిపాడు. ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్న తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నాడు. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రిన్స్ వచ్చేస్తున్నాడు!
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తిరిగి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం.శుక్రవారం(నవంబర్ 29) మొదటిసారి గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రాక్టీస్‌లో అతడికి ఎటువంటి సమస్యలు తలెత్తకపోతే సెకెండ్ టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి టెస్టుకు ముందు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటన వేలికి గాయమైంది. దీంతో ఆఖరి నిమిషంలో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. మరోవైపు రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వచ్చాడు.వీరిద్దరూ జట్టులోకి వస్తే పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఇక ఈ రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలు కానుంది. కాగా తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాతో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
మహారాష్ట్ర కేబినెట్: కుదిరిన ఏకాభిప్రాయం.. బీజేపీకే సగం బెర్త్‌లు?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడినట్లే కనిపిస్తోంది. శివసేన నేత ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడంతో ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని షిండే ప్రకటించడంతో.. ఇక ఫడ్నవీస్ సీఎం అవడం ఖరారైనట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా మహాయుతి కూటమిలోని కేబినెట్ కూర్పులోని ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కేబినెట్లో గరిష్టంగా 43 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉండగా.. ముఖ్యమంత్రితో సహా మంత్రి మండలిలో సగం శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. దాదాపు 20 మంది మంత్రులకు పదవులు తీసుకునే ఛాన్స్ ఉంది.ఇక సీఎం పీఠాన్ని వదులుకున్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మూడు కీలక మంత్రిత్వ శాఖలు.. పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, జలవనరులతోపాటు 12 కేబినెట్ బెర్త్‌లను ఇచ్చేందుకు అవకాశం ఉందని సంబంధిత వార్గాలు తెలిపాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మంత్రివర్గంలో తొమ్మిది శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేన, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నేడు(గురువారం) ఢిల్లీలో జరగబోయే మహాయుతి నేతల కీలక సమావేశంలో దీనిపై పూర్తి లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 30న గానీ, వచ్చే నెల 1నగానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశముంది. -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
'నిజంగా నేను ఆశ్చర్యపోయాను.. థాంక్యూ ముంబై ఇండియన్స్'
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఈ వేలంలో అన్క్యాప్డ్ న్యూజిలాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ అందరిరని ఆశ్చర్యపరిచింది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే వంటి కివీస్ స్టార్ క్రికెటర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిన చోట.. జాకబ్స్ అమ్ముడుపోవడంతో అందరూ విస్తుతపోయారు. 21 ఏళ్ల జాకబ్‌ను రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబై తనను దక్కించుకోవడాన్ని బెవాన్ జాకబ్స్ సైతం నమ్మలేకపోతున్నాడు."ఉదయం మేల్కొన్నవెంటనే వేలంలో నేను అమ్ముడుపోయానన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా నాకు ఇది చాలా పెద్ద అవకాశం. నన్ను కొనుగోలు చేసినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు.నాకు అక్కడ ఆడే అవకాశం లభిస్తే ఇంకా ఎక్కువగా సంతోషపడతాను. ముంబై ఇండియన్స్ వంటి అద్బుత ఫ్రాంచైజీలో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకబ్ పేర్కొన్నాడు.ఇప్పటివరకు ఆరు టీ20లు ఆడిన జాకబ్.. 33.50 సగటుతో 134 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ 2024-25 సీజన్‌పై జాకబ్ దృష్టిపెట్టాడు. సూపర్ స్మాష్ సీజన్‌ను ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని జాకబ్ భావిస్తున్నాడు.ఈ టోర్నీలో అతడు ఆక్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే డెవాల్డ్ బ్రెవిస్, క్రిష్మార్ సాంటోకీ వంటి విదేశీ ఆటగాళ్లు తమ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించిన సీన్స్‌ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్ ఆర్టిస్ట్‌లు మాత్రమే పాల్గొన్నారు. -
హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?
హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్‌లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ని కూడా ప్రదర్శించారట.జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్‌లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil)