-
పోలవరం ఇక బ్యారేజ్!
అనుకున్నంతా అయ్యింది.. ఏది జరగకూడదని ఇన్నాళ్లూ అనుకున్నామో అదే జరిగింది.. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తున్నారంటే.. అబ్బే కాదు కాదని బుకాయించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోంది. నాడు–నేడు చంద్రబాబు తీరే ఈ ప్రాజెక్టుకు శాపంగా పరిణమించిందని తేటతెల్లమవుతోంది. భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్తా బ్యారేజ్‌గా మారిపోనుందన్న నిజాన్ని నీటి పారుదల రంగ నిపుణులు, రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ మేరకు నీరు నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నామని.. ఎత్తును తగ్గించలేదని చెప్పారు. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద నీళ్లందిస్తున్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి మాత్రమే పోలవరం బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అక్కరకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆయకట్టుకు కూడా గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి సాధ్యమవుతుందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.67 ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.06 లక్షలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ.. 540 గ్రామాల్లోని 28.50 లక్షల మందికి తాగునీళ్లు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు అందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. ఇక ప్రాజెక్టులో అంతర్భాగంగా నిరి్మస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి వీలుండదని.. గోదావరి సిగలో కలికితురాయిగా వెలుగులీనాల్సిన ఆ కేంద్రం ఒట్టి దిష్టి»ొమ్మగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోరు మెదపని టీడీపీ కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో కనీస నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న పీఐబీ (పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు) కేంద్రానికి ప్రతిపాదించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1.53 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించవచ్చని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడం, విశాఖకు నీటి సరఫరా చేయొచ్చని ఆ ప్రతిపాదనలో పీఐబీ స్పష్టం చేసింది. అయితే అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే వైఎస్సార్సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో పీఐబీ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. కానీ.. ఆగస్టు 28న పీఐబీ ప్రతిపాదించిన దానికి భిన్నంగా.. 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తూ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందుకు కేంద్ర ఆర్థిక శాఖ పంపింది.ఈ ప్రతిపాదనపై ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పలేదు. అంటే.. అటు కేంద్రంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి అంగీకరించాయన్నది స్పష్టమవుతోంది. నాడూ.. నేడూ పోలవరానికి ‘చంద్ర’ ద్రోహం రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం తాగునీటి విభాగం, జల విద్యుత్ విభాగానికి అయ్యే వ్యయం కాకుండా కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లు ఇస్తే చాలని చెప్పారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం సంగతి గాలికొదిలేశారు. కమీషన్లు వచ్చే మట్టి పనులనే 2016–19 మధ్య చేపట్టి, ఆ ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించారు. తద్వారా డయా ఫ్రం వాల్ దెబ్బ తినడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురవ్వడానికి వరద మళ్లింపు పనులు పూర్తి చేయక పోవడమేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవల తేల్చి చెప్పింది. అప్పట్లో విధ్వంసం సృష్టించి.. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. పోలవరానికి ద్రోహం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశల్లో పోలవరం.. ప్రతిపాదించింది కేంద్రమే » నీటి పారుదల, తాగు నీటి విభాగాలు వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, తాగునీటి విభాగానికి అయ్యే రూ.4,068 కోట్లను ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఆ ప్రతిపాదనను కేంద్ర జల్ శక్తి శాఖకు పంపారు. ఈ అంశంపై 2021 జూలై 29న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనతో సీడబ్ల్యూసీ నాటి ఛైర్మన్ హెచ్‌కే హల్దర్ ఏకీభవించారు. » ఆ సమావేశంలో 1986 మార్చి 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది కనీస నీటి మట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత దశల వారీగా ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని హల్దర్ సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరంలో 35.44, 35.50, 41.15, 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలపాలంటూ పీపీఏ సీఈవోకు కేంద్ర జల్ శక్తి శాఖ అప్పటి సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్ కుమార్ శ్రీవాత్సవ 2021 అక్టోబర్ 27న లేఖ రాశారు. ఇదే లేఖను ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపిన పీపీఏ.. ఆ వివరాలు ఇవ్వాలని కోరింది. » 35.44, 35.50 మీటర్లలో నీటిని నిల్వ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. కనీస నీటి మట్టం 41.15 మీటర్లలో నిల్వ చేస్తే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని.. 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టును స్థిరీకరించడం, 28.50 లక్షల మందికి తాగు నీరు, విశాఖకు 23.44 టీఎంసీలు సరఫరా చేయవచ్చునని వివరించారు. » ఇదే వివరాలను కేంద్ర జల్ శక్తి కార్యదర్శికి వివరిస్తూ 2021 నవంబర్ 20న పీపీఏ అప్పటి సభ్య కార్యదర్శి ఎంకే శ్రీనివాస్ లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగానే పోలవరాన్ని రెండు దశల్లో.. తొలి దశలో 41.15 మీటర్లలో 115.44 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా పనులు చేçపట్టడానికి నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. » పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.23,622.35 కోట్లు అవసరం. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా ఆ నిధులు మిగుల్చుకోవచ్చన్నది కేంద్రం ఆలోచన. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఉంటుందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చనే కేంద్రం ఇలా చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీవనాడిగా మార్చిన వైఎస్ జగన్ » రాష్ట్రంలో 2019 మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ గాడిలో పెట్టారు. జీవచ్ఛవాన్ని జీవనాడిగా మార్చారు. రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. » చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల కోతకు గురైన దిగువ కాఫర్ డ్యాంను సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) మార్గదర్శకాల మేరకు పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే సొరంగాలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో డయాఫ్రం వాల్ వేశారు. గ్యాప్–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. » ప్రాజెక్టుకు తాజా ధరల మేరకు నిధులు ఇచ్చి సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. తాగు నీటి విభాగం, నీటి పారుదల విభాగం వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని, అందుకయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రధాని మోదీ అంగీకరించారు. రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేద్దామని.. తొలి దశలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. -
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్
గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. హీరోయిన్ కీర్తి సురేశ్.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆంటోని తట్టిళ్‌తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. బాలనటిగా చేసింది. 'నేను శైలజ' మూవీ హీరోయిన్ అయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటించింది. హిందీలోనూ ఈమె తొలి మూవీ 'బేబీ జాన్' త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధ్రువీకరించింది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్లో ఒకరికి ఒకరు పరిచయం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ కాగా.. ఆంటోని ఇంజినీరింగ్ చేసి ఖతార్‌లో కొన్నాళ్లు పనిచేసాడు. తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.15 ఏళ్ల ప్రేమని కొన్నాళ్ల క్రితం పెద్దలకు చెప్పారు. వాళ్ల కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 11న గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరగనుంది. బహుశా హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందేమో!(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
రామ్ చరణ్ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. గేమ్ ఛేంజర్‌లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది. What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024 -
‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం
న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు చొరవతో ఆ కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం లభించింది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు వారాల్లోగా ఆ కానిస్టేబుల్ కుమారునికి ప్రభుత ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.వివరాల్లోకి వెళితే యూపీలోని అలీఘర్ నివాసి వీరేంద్ర పాల్ సింగ్ తండ్రి శిశుపాల్ సింగ్ యూపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయన 1995లో అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయంలో అతని కుమారుడు వీరేంద్ర పాల్ సింగ్ మైనర్ కావడంతో, అతని తల్లి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.అయితే 13 సంవత్సరాల తరువాత మేజర్ అయిన వీరేంద్ర పాల్ సింగ్ 2008లో కారుణ్య నియామకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో జాప్యం జరిగిన కారణంగా యూపీ ప్రభుత్వం ఆ దరఖాస్తును తిరస్కరించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరేంద్ర పాల్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై పునర్విచారణ జరపాలని హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని యూపీ ప్రభుత్వం పునరాలోచన చేసి, తిరస్కరించింది.కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయడంలో జరిగిన జాప్యాన్ని మన్నించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇలా కోర్టులో వాదప్రతివాదనలతో చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే 2021లో అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా వీరేంద్రకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై పరిశీలించాలని కోరింది. యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. అయితే అది 2022లో దానిని తిరస్కరణకు గురయ్యింది. అతని కారుణ్య నియామకాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.దీనిపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సందీప్ మెహతాలు.. యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ, హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో తమకు లోపం కనిపించలేదని పేర్కొన్నారు. ఎటువంటి తప్పు లేకుండా 2010 సంవత్సరం నుండి ఈ కేసును కొనసాగిస్తున్నారని, తాము ఈ అప్పీల్‌ను స్వీకరించడానికి ఇష్టపడటం లేదని, దీనిని కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ఉత్తర్వు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల వ్యవధిలోగా ప్రతివాదికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానిస్టేబుల్ కుమారుని తరపున న్యాయవాది వంశజా శుక్లా వాదనలో పాల్గొన్నారు. కాగా కానిస్టేబుల్ శిశుపాల్ సింగ్ 1992లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’
వైఎస్సార్ జిల్లా, సాక్షి: అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గురువారం ఈ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపైనా మండిపడ్డారు.‘‘అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు... షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా జగన్‌కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. .. గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్‌రెడ్డి.. అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ‘‘నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేసింది’’ అని శివప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు.అమెరికా కేసులో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన... చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. -
చాయ్ తాగేందుకు వెళితే ఏకంగా ప్రాణమే పోయింది!
మూసాపేట: టీస్టాల్ వద్ద కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ (22) ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. ఈ నెల 22న రాత్రి కూకట్‌పల్లిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలు తింటున్నాడు. అదే సమయంలో చెన్నబోయిన పవన్, అతడి సోదరుడు చెన్నబోయిన శ్రీధర్ తమ చెల్లెలు, మరదలితో కలిసి అదే టిఫిన్ సెంటర్వద్దకు టీ తాగేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణ అతని స్నేహితులు పవన్ చెల్లెలు, మరదల్ని కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చెన్నబోయిన శ్రీధర్ బానోత్ సురేష్, గుంటుక అజయ్ కుమార్ అనే యువకులకు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. నలుగురు కలిసి వెంకటరమణపై దాడి చేశారు. పవన్ హోటల్లో ఉన్న చపాతి కర్రతో వెంకటరమణ తలపై మోదాడు కొద్దిసేపు ఘర్షణ పడిన ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 23న ఉదయం వెంకటరమణ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పరీక్షించి తలకు లోపల బలమైన గాయంకారణంగా మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు చెన్నబోయిన పవన్, చెన్నబోయిన శ్రీధర్, బానోతు సురేష్, గుంటుక అజయ్ కుమార్‌లను అరెస్టు చేసి రిమాడ్‌కు తరలించారు. -
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్‌పై నాగ్ మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్‌కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. -
రూ.5,900 కోట్ల విలువైన బిట్కాయిన్లు చెత్తకుప్ప పాలు!
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు. అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది. -
ఐటీ జాబ్స్.. వచ్చే ఆరు నెలలూ అదుర్స్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ వేగవంతంగా మారిపోతున్న నేపథ్యంలో దేశీయంగా ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నియామకాలు 10–12 శాతం వరకు పెరగనున్నాయి. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలతో 2030 నాటికి పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది.బిజినెస్ సర్వీసుల సంస్థ క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో క్వెస్ ఐటీ స్టాఫింగ్ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. టెక్ నియామకాలకు నెలకొన్న డిమాండ్, మార్కెట్లో పరిస్థితుల గురించి సంస్థలకు అవగాహన కల్పించే విధంగా గణాంకాలను ఇందులో విశ్లేషించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సైబర్‌సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నిపుణులైన సిబ్బందికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్రితం త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్‌సెక్యూరిటీలో 58 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరిగాయి. పుష్కలంగా టెక్ నిపుణుల లభ్యత, వినూత్నంగా ఆలోచించగలిగే సామర్థ్యాలతో డిజిటల్ విప్లవానికి సంబంధించి భారత్ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో దేశీయంగా వచ్చే 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో హైరింగ్ 10–12 శాతం పెరగవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. టాప్ 5 నైపుణ్యాలు.. నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్ డిమాండ్‌లో 79 శాతం వాటా .. ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డెవలప్మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్‌సెక్యూరిటీ (20 శాతం), డెవ్ఆప్స్ (25 శాతం) వంటి ప్రత్యేక నైపుణ్యాలకు కూడా డిమాండ్ నెలకొంది.క్యూ2లో టెక్ హైరింగ్‌కి సంబంధించి జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ఆప్స్ నిపుణులకు డిమాండ్ కనిపించింది. ప్రాంతాలవారీగా చూస్తే మొత్తం ఉద్యోగావకాశాలకు సంబంధించి 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 43.5 శాతంతో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా జీసీసీలు విస్తరిస్తుండటంతో వివిధ నగరాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ పెరిగింది. ఈ సంస్థలు ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి విభాగాల్లో సుశిక్షితులైన నిపుణులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. -
చిన్మయ్ కృష్ణదాస్‌తో మాకు సంబంధం లేదు: ఇస్కాన్
ఢాకా : బంగ్లాదేశ్ ఇస్కాన్ పరిణామాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహారంపై బంగ్లాదేశ్ ఇస్కాన్ స్పందించింది.చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై బంగ్లాదేశ్ ఇస్కాన్ జనరల్ సెక్రటరీ చారు చంద్రదాస్ స్పందించారు. చిన్మయ్‌తో, ఆయన చేసిన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. గతంలోనే చిన్మయ్‌ను మా సంస్థ నుంచి తొలగించాం’ అని అన్నారు. గతంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని సంస్థాగత కార్యకలాపాల నుండి, పదవుల నుండి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును తొలగించినట్లు చెప్పారు. న్యాయవాది మరణంపై జరుగుతున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. న్యాయ వాది మరణం, దేశంలో కొనసాగుతున్న నిరసనలతో బంగ్లాదేశ్ ఇస్కాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇస్కాన్ మతపరమైన, ఘర్షణ కార్యకలాపాలలో పాల్గొనలేదని, ఐక్యత సామరస్యాన్ని పెంపొందించడంలో మాత్రమే పాల్గొంటుందని ఆయన అన్నారు. #Bangladesh | Chinmoy Krishna Das Brahmachari does not belong to us: #ISKCONBangladesh The organization would not shoulder any responsibility over his statements and speech: Charu Chandra Das Brahmachari, General Secretary, #ISKCON Bangladesh@DhakaPrasar #ChinmoyKrishnaDas… pic.twitter.com/cuaR5SRc6V— All India Radio News (@airnewsalerts) November 28, 2024