-
ఐటీ జాబ్స్.. వచ్చే ఆరు నెలలూ అదుర్స్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ వేగవంతంగా మారిపోతున్న నేపథ్యంలో దేశీయంగా ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నియామకాలు 10–12 శాతం వరకు పెరగనున్నాయి. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలతో 2030 నాటికి పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది.బిజినెస్ సర్వీసుల సంస్థ క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో క్వెస్ ఐటీ స్టాఫింగ్ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. టెక్ నియామకాలకు నెలకొన్న డిమాండ్, మార్కెట్లో పరిస్థితుల గురించి సంస్థలకు అవగాహన కల్పించే విధంగా గణాంకాలను ఇందులో విశ్లేషించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సైబర్‌సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నిపుణులైన సిబ్బందికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్రితం త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్‌సెక్యూరిటీలో 58 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరిగాయి. పుష్కలంగా టెక్ నిపుణుల లభ్యత, వినూత్నంగా ఆలోచించగలిగే సామర్థ్యాలతో డిజిటల్ విప్లవానికి సంబంధించి భారత్ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో దేశీయంగా వచ్చే 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో హైరింగ్ 10–12 శాతం పెరగవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. టాప్ 5 నైపుణ్యాలు.. నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్ డిమాండ్‌లో 79 శాతం వాటా .. ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డెవలప్మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్‌సెక్యూరిటీ (20 శాతం), డెవ్ఆప్స్ (25 శాతం) వంటి ప్రత్యేక నైపుణ్యాలకు కూడా డిమాండ్ నెలకొంది.క్యూ2లో టెక్ హైరింగ్‌కి సంబంధించి జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ఆప్స్ నిపుణులకు డిమాండ్ కనిపించింది. ప్రాంతాలవారీగా చూస్తే మొత్తం ఉద్యోగావకాశాలకు సంబంధించి 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 43.5 శాతంతో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా జీసీసీలు విస్తరిస్తుండటంతో వివిధ నగరాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ పెరిగింది. ఈ సంస్థలు ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి విభాగాల్లో సుశిక్షితులైన నిపుణులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. -
కోహ్లి అద్భుతం.. జైస్వాల్ దూసుకుపోతున్నాడు.. ఇంకా: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లి మరింత చెలరేగడం ఖాయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.కోహ్లి శతకాలు@81 కాగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి టెస్టుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. దాదాపు 491 రోజుల తర్వాత అతడు ఓ ఇన్నింగ్స్‌లో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 81కి పెంచుకున్నాడు. ఆసీస్‌తో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా కోహ్లి ఈ ఘనత సాధించాడు.కోహ్లి అద్భుతంకఠిన పరిస్థితుల్లో తన అనుభవాన్ని రంగరించి జట్టు భారీ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. తద్వారా విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు నెలల క్రితం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.సఫారీ గడ్డపై కఠినమైన పిచ్‌లపై కూడా బ్యాట్‌తో అదరగొట్టాడు. తను మళ్లీ టచ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. సిరీస్ ఆరంభంలోనే శతకం బాదడం శుభసూచకం. ఈ సిరీస్‌లో మరోసారి కోహ్లి తనదైన మార్కు వేయబోతున్నాడని అనిపిస్తోంది’’ అని కోహ్లిని ప్రశంసించాడు.అందరికీ సాధ్యం కాదుఇక ఇదే మ్యాచ్‌లో 161 పరుగులతో దుమ్ములేపిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై కూడా ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోజురోజుకూ అతడు ఊహించనిరీతిలో ఆటను మెరుగుపరచుకుంటున్నాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదని.. జైస్వాల్ మాత్రం పక్కా ప్రణాళికతో తన వ్యూహాలను అమలు చేసిన తీరు ఆకట్టుకుందని ద్రవిడ్ కితాబులిచ్చాడు.బుమ్రా ఆటగాడిగా, సారథిగా సూపర్ హిట్అదే విధంగా.. పెర్త్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా అభినందించాడు. తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలతో జట్టును ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపించాడంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.భారీ విజయంతో మొదలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కాగా.. బుమ్రా టీమిండియాకు సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్‌లో జైస్వాల్, కోహ్లి సెంచరీలతో రాణించగా.. బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య కాన్బెర్రా వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు -
ఒకవైపు లెబనాన్‌లో సంబురాలు.. మరొకవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడులు
జెరూసలేం: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ వాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడుల కారణంగా దాదాపు 12 లఓల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం.అగ్ర రాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనపిస్తోంది. దాడులు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా దఓిణ లెబనాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. దీంతో, కొంత మంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 44వేల మంది చనిపోయారు. -
Telangana: ఇక ఫొటోలు తీసి తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు. ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో హెడ్మాస్టర్, స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్ రూం, కిచెన్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్ వైజ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
తిలక్ వర్మ విఫలం.. హైదరాబాద్‌కు మరో ఓటమి
రాజ్‌కోట్: బ్యాటర్ల వైఫల్యంతో దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 24 పరుగుల తేడాతో రాజస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (27 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకోగా... దీపక్ హుడా (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 97 పరుగుల జోడించడంతో రాజస్తాన్ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో విజృంభించిన హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (13) ఈసారి విఫలం కాగా... తన్మయ్ అగర్వాల్ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తనయ్ త్యాగరాజన్ (32 నాటౌట్; 3 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్తాన్ బౌలర్లలో మానవ్ సుతార్, అనికేత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాజా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ జట్టు 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో రేపు బిహార్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
పుష్ప-2లో ఆయన పాత్ర వేరే లెవల్.. అల్లు అర్జున్ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహించారు. నగరంలోని లివా మాల్ గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌పై ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దాదాపు 20 ఏళ్లుగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. మల్లు అర్జున్‌గా మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా చేశారు. ప్రతి కేరళియన్ గర్వపడేలా ఉంటుంది. ఫాఫా మీ అందరిని అలరిస్తారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. పుష్ప విడుదలై మూడేళ్లవుతోంది. ఇకపై ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించను. ఇప్పటి నుంచి సినిమాలు త్వరగా చేస్తాను. శ్రీవల్లితో మూడేళ్లుగా నా ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాలో తన సపోర్ట్‌కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రష్మిక' అని అన్నారు.సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నేషనల్ క్రష్ రష్మిక మరోసారి శ్రీవల్లిగా అలరించనుంది. పుష్పలో భన్వర్‌లాల్ షెకావత్‌గా అలరించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీ రోల్ ప్లే చేస్తున్నారు. A Special surprise coming your way 💥💥💥Get ready for the Mass Blast🎧🔥Watch #PushpaRulesKeralam Event Live now... For the Blasting Surprise ❤️🔥❤️🔥- https://t.co/QdHDdVrAj9#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
సస్పెన్స్... థ్రిల్
వేదిక ప్రధానపాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఫియర్’. డా. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని డిసెంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు.‘‘ఫియర్’ సినిమా విడుదలకు ముందే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాను: స్టోక్స్
క్రైస్ట్‌చర్చ్: జాతీయ జట్టు తరఫున సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని తాను కోరుకుంటున్నానని... ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి ఇతర టోర్నీలకు దూరంగా ఉంటున్నానని ఇంగ్లండ్ టెస్టు కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోకుండా స్టోక్స్ ముందే తప్పుకున్నాడు. గతంలో పుణే, చెన్నై, రాజస్తాన్ జట్ల తరఫున ఆడిన స్టోక్స్‌కు లీగ్‌లో మంచి విలువే పలికింది. అయితే ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్ జట్టు తరఫున కెరీర్‌ను పొడిగించుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. ఐపీఎల్ తాజా నిబంధన ప్రకారం 2026 వరకు కూడా అతని లీగ్‌లో ఆడే అవకాశం లేదు. ‘నా కెరీర్లో ఇప్పుడు చివరి దశకు చేరుకుంటున్నాననేది వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడేందుకు నేను ప్రయత్నిస్తా. నా ఫిట్నెస్ను చూసుకోవడం కూడా చాలా కీలకం. ఈ దశలో ఎప్పుడు ఆడాలనే అంశంపై నా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పొడిగించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు చోట్ల వరుసగా క్రికెట్ సాగుతున్న ప్రస్తుత దశలో ఇంగ్లండ్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనేది నా కోరిక. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు. సుదీర్ఘ మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన స్టోక్స్‌కు అక్టోబర్ 2026 వరకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ ఉంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టోక్స్‌కు వచ్చే ఏడాది స్వదేశంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆపై యాషెస్ సిరీస్ కీలకం కానున్నాయి. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు దూరంగా ఉంటున్న స్టోక్స్ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ వన్డేలు ఆడే అవకాశం ఉంది. -
జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్‌లింక్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటినే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలోనే 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును మన దేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశీయ టెలికామ్ సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ సర్వీస్ దేశంలో ప్రారంభమైన తరువాత.. ఇది చాలా ఖరీదైనదిగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ధరలను కూడా కంపెనీ ప్రకటించలేదు.కంపెనీ మాజీ హెడ్ ప్రకారం.. స్టార్‌లింక్ మన దేశంలో ప్రారంభమైతే, మొదటి సంవత్సరంలో పన్నులతో సహా రూ. 1,58,000 ఖర్చు అవుతుంది. ఇందులో వన్‌టైమ్ ఎక్విప్మెంట్ ధర రూ. 37,400.. నెలవారీ సర్వీస్ ఫీజు రూ. 7,425గా ఉంటుంది. రెండో ఏడాది యూజర్ సుమారు రూ. 1,15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.స్టార్‌లింక్ సర్వీస్ చార్జీలతో పోలిస్తే.. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి సర్వీస్ చార్జీలు చాలా తక్కువ. కాబట్టి స్టార్‌లింక్ మన దేశంలో మంచి ఆదరణ పొందుతుందా? అనేది ప్రశ్నార్థంగా ఉంది.స్టార్‌లింక్ సర్వీస్ ధరలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఈ సేవలకు అవసరమైన లైసెన్స్‌లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ధృవీకరించారు. అయితే స్టార్‌లింక్ సక్సెస్ అనేది మొత్తం దాని చేతుల్లోనే ఉంది.భారతదేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి.. స్టార్‌లింక్ దాని ధరలను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే.. స్టార్‌లింక్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు డిసెంబర్ 15 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. -
సంపద సృష్టించడం అంటే ఇది: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఒక రాష్ట్రానికి ఉన్న ఆదాయం కాకుండా.. ఇంకా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని.. భవిష్యత్తులో ఎక్కువ మార్గాలు వచ్చేలా ఉంటే.. అది సంపద సృష్టి’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వైఎస్సార్సీపీ హయాంలోనే సంపద సృష్టి జరిగింది. మూడు కొత్త పోర్టులు.. అదీ నిర్మాణం వేగంగా సాగింది. దాదాపుగా పూర్తి కావొచ్చిన వాటి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అదనపు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. మెడికల్ కాలేజీల వస్తే ఖర్చులు తగ్గుతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో.. సంపద సృష్టి జరుగుతుంది. ఈ పోర్టులు, మెడికల కాలేజీలు భవిష్యత్తు సంపద. ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేయాలి’’ అంటూ చంద్రబాబుకు సూచనలు చేశారు వైఎస్ జగన్.Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.