-
జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్‌లింక్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటినే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలోనే 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును మన దేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశీయ టెలికామ్ సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ సర్వీస్ దేశంలో ప్రారంభమైన తరువాత.. ఇది చాలా ఖరీదైనదిగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ధరలను కూడా కంపెనీ ప్రకటించలేదు.కంపెనీ మాజీ హెడ్ ప్రకారం.. స్టార్‌లింక్ మన దేశంలో ప్రారంభమైతే, మొదటి సంవత్సరంలో పన్నులతో సహా రూ. 1,58,000 ఖర్చు అవుతుంది. ఇందులో వన్‌టైమ్ ఎక్విప్మెంట్ ధర రూ. 37,400.. నెలవారీ సర్వీస్ ఫీజు రూ. 7,425గా ఉంటుంది. రెండో ఏడాది యూజర్ సుమారు రూ. 1,15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.స్టార్‌లింక్ సర్వీస్ చార్జీలతో పోలిస్తే.. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి సర్వీస్ చార్జీలు చాలా తక్కువ. కాబట్టి స్టార్‌లింక్ మన దేశంలో మంచి ఆదరణ పొందుతుందా? అనేది ప్రశ్నార్థంగా ఉంది.స్టార్‌లింక్ సర్వీస్ ధరలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఈ సేవలకు అవసరమైన లైసెన్స్‌లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ధృవీకరించారు. అయితే స్టార్‌లింక్ సక్సెస్ అనేది మొత్తం దాని చేతుల్లోనే ఉంది.భారతదేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి.. స్టార్‌లింక్ దాని ధరలను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే.. స్టార్‌లింక్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు డిసెంబర్ 15 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. -
బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..
రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లలో కొనుగోలు చేయవచ్చు.రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లను ఎంచుకునే వారికి, ఫైనాన్స్ భాగస్వాములైన బజాజ్ ఫిన్సర్వ్.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో రూ.22,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఓ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16ను ఇప్పుడు రూ. 70,900లకు, ఐప్యాడ్లను 1,371 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే రూ.25,000 తక్షణ తగ్గింపుగా పొందవచ్చు. అదే సమయంలో రూ.8,995 విలువైన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 1,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.బీపీఎల్ 1.5 టన్స్ 3 స్టార్ ఏసీను రూ. 29,990కే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీలపై కూడా సూపర్ కూల్ ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ల మీద కూడా అద్భుతమైన తగ్గింపులను పొందవచ్చు. ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై రూ. 26000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 8990 విలువైన సోనీ సీ510 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ. 3990కే సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల కొనుగోలుపై కూడా తగ్గింపును పొందవచ్చు.ట్రెండ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కస్టమర్లకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి.. ట్రెండ్స్ కూడా ప్రత్యేక చొరవను అమలు చేస్తోంది. ఇక్కడ 3,499 రూపాయలకు షాపింగ్ చేస్తే.. రూ.2,000 విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. ట్రెండ్స్ స్టోర్లు.. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో తగ్గింపు ధరలతో మంచి షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. -
Telangana: ఇక ఫొటోలు తీసి తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు. ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో హెడ్మాస్టర్, స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్ రూం, కిచెన్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్ వైజ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్‌ను కిగాలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
సస్పెన్స్... థ్రిల్
వేదిక ప్రధానపాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఫియర్’. డా. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని డిసెంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు.‘‘ఫియర్’ సినిమా విడుదలకు ముందే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
యు ముంబాపై తెలుగు టైటాన్స్ గెలుపు
నోయిడా: స్టార్ రెయిడర్లు ఆశిష్ కుమార్, విజయ్ చెరో 10 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిన టైటాన్స్... గురువారం జరిగిన పోరులో 41–35 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై ఘనవిజయం సాధించింది. అటు రెయిడింగ్, ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి సత్తా చాటగా... యు ముంబా జట్టు టైటాన్స్‌ను ఒకేసారి ఆలౌట్ చేయగలిగింది. తాజా లీగ్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 9 విజయాలు, 5 పరాజయాలతో 48 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 46 పాయింట్లతో ఉన్న యు ముంబా మూడో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 33–29తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), గుజరాత్ జెయింట్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాను: స్టోక్స్
క్రైస్ట్‌చర్చ్: జాతీయ జట్టు తరఫున సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని తాను కోరుకుంటున్నానని... ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి ఇతర టోర్నీలకు దూరంగా ఉంటున్నానని ఇంగ్లండ్ టెస్టు కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోకుండా స్టోక్స్ ముందే తప్పుకున్నాడు. గతంలో పుణే, చెన్నై, రాజస్తాన్ జట్ల తరఫున ఆడిన స్టోక్స్‌కు లీగ్‌లో మంచి విలువే పలికింది. అయితే ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్ జట్టు తరఫున కెరీర్‌ను పొడిగించుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. ఐపీఎల్ తాజా నిబంధన ప్రకారం 2026 వరకు కూడా అతని లీగ్‌లో ఆడే అవకాశం లేదు. ‘నా కెరీర్లో ఇప్పుడు చివరి దశకు చేరుకుంటున్నాననేది వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడేందుకు నేను ప్రయత్నిస్తా. నా ఫిట్నెస్ను చూసుకోవడం కూడా చాలా కీలకం. ఈ దశలో ఎప్పుడు ఆడాలనే అంశంపై నా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పొడిగించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు చోట్ల వరుసగా క్రికెట్ సాగుతున్న ప్రస్తుత దశలో ఇంగ్లండ్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనేది నా కోరిక. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు. సుదీర్ఘ మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన స్టోక్స్‌కు అక్టోబర్ 2026 వరకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ ఉంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టోక్స్‌కు వచ్చే ఏడాది స్వదేశంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆపై యాషెస్ సిరీస్ కీలకం కానున్నాయి. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు దూరంగా ఉంటున్న స్టోక్స్ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ వన్డేలు ఆడే అవకాశం ఉంది. -
HYD:పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ఎనిమిది బైకులు దగ్ధం
సాక్షి,హైదరాబాద్: నగరంలో మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం బ్యాటరీ పేలింది. రామంతాపూర్ వివేక్‌నగర్‌లో బుధవారం(నవంబర్ 27) తెల్లవారుజామున 3గంటల30నిమిషాలకు ఘటన జరిగింది.పార్క్ చేసి ఉన్న బైక్‌లో ఉన్న బ్యాటరీ పేలింది.పేలుడు దాటికి బైకు పూర్తిగా దగ్ధమైంది.మంటల తీవ్రతకు పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ఎనిమిది బైకులు కాలి బూడిదయ్యాయి. ఇదీ చదవండి: ఫ్యాబ్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం -
హైదరాబాద్ నుంచి విస్తారా విమానాలు!
ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్వేస్కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్‌లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్‌తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు నటుడిగా బిజీ అయిపోయాడు. ఇతడు హీరోగా నటించిన ఓ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పెట్టా రాప్'. అక్టోబరులో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కాగా.. డిజాస్టర్‌గా నిలిచింది. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్‌తో పాటు సన్నీలియోన్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.'పెట్టా రాప్' విషయానికొస్తే.. బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలనే కలతో బతుకుతుంటాడు. వందకుపైగా ఆడిషన్స్ ఇచ్చిన ఒక్క అవకాశం రాదు. ఎప్పటికీ నటుడివి కాలేవని స్నేహితులు బాలను అవమానిస్తారు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా బాల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)