-
Telangana: ఇక ఫొటోలు తీసి తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు. ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో హెడ్మాస్టర్, స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్ రూం, కిచెన్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్ వైజ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
వాషింగ్టన్ సుందర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్‌లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.మూడు జట్లకుక్యాష్ రిచ్ లీగ్‌లో 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్ఆర్హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సన్‌రైజర్స్‌కు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు. -
రూ.27 కోట్లలో రిషబ్ పంత్ చేతికి వచ్చేది ఎంతంటే..
ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఏకంగా రూ.27 కోట్ల ధరకు పలికాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ కూడా పంత్ కోసం పోటీపడి ఊరుకున్నాయి.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పొందుతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.డిసెంబర్ 2022లో రోడ్డుప్రమాదం నుంచి బయటపడిన పంత్‌కు మోకాలి సర్జరీ జరిగింది. ఆ తరువాత పంత్ క్రికెట్ ఆడలేడేమో అని అందరూ భావించారు. కానీ పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ బ్యాట్ చేతపట్టుకున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఐపీల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. -
అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్‌సోల్డ్.. నా హృదయం ముక్కలైంది!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.ఈసారి అతడు అన్సోల్డ్అదే విధంగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒకడు. అతడు ఈసారి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్ ఠాకూర్ పేరు రానేలేదు. క్రికెట్, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.సీఎస్కే అందరి కోసం ట్రై చేసిందితాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లలో శార్దూల్ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లుకాగా 2015లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్‌బై చెప్పింది. ఇక శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లు ఆడి 307 రన్స్ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!? -
భారత్‌తో సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది. కాగా భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లకు షెడ్యూల్ ఖరారైంది.డిసెంబరు 15న టీ20తో మొదలునవీ ముంబై వేదికగా డిసెంబరు 15న టీ20తో మొదలుకానున్న విండీస్ ఇండియా టూర్.. డిసెంబరు 27న మూడో వన్డేతో ముగియనుంది. పొట్టి సిరీస్‌కు నవీ ముంబై వేదికకాగా... బరోడా వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రకటించిన విండీస్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ స్టెఫానీ టేలర్ పేరు మిస్ అయింది.మహిళల టీ20 ప్రపంచకప్ -2024 సందర్భంగా స్టెఫానీ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె మైదానంలో దిగలేదు.ఇప్పుడు ఇండియా టూర్‌కు కూడా స్టెఫానీ దూరమైంది. మరోవైపు.. మాజీ కెప్టెన్ డియాండ్ర డాటిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో పునరాగమనం చేయనుంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో విండీస్ సెమీస్ చేరగా.. భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ మహిళా జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్ (వైస్ కెప్టెన్), ఆలియా అల్లీన్, షమీలియా కాన్నెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, చినెల్ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసర్, కరిష్మా రాంహారక్, రషదా విలియమ్స్ .భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్టీ20 సిరీస్👉మొదటి టీ20- డిసెంబరు 15- ఆదివారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉రెండో టీ20- డిసెంబరు 17- మంగళవారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉మూడో టీ20- డిసెంబరు 19- గురువారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబైవన్డే సిరీస్👉తొలి వన్డే- డిసెంబరు 22- ఆదివారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉రెండో వన్డే- డిసెంబరు 24- మంగళవారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉మూడో వన్డే- డిసెంబరు 27- శుక్రవారం- ఉదయం తొమ్మిదిన్నర గంటలకు- బరోడా. -
మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ది రాజాసాబ్ నటి
టాలీవుడ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై సీనియర్ నటి జరీనా వాహబ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ గురించి ఆమె మాట్లాడారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో జరీనా వాహబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ తీరు గురించి ఆమె మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానని జరీనా వెల్లడించారు.జరీనా వాహబ్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్నా. ది రాజాసాబ్‌లో నటిస్తున్నా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. మరో జన్మ ఉంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో తప్పకుండా ప్రభాస్ లాంటి కుమారుడు నాకు కావాలని కోరుకుంటా. అంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అతనొక స్టార్ అనే ఫీలింగ్ లేదు. సెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే షూటింగ్ సిబ్బందితో పాటు అందరికీ భోజనాలు ఇంటికి ఫోన్ చేసి మరి తెప్పిస్తాడు. ప్రభాస్ నిజమైన డార్లింగ్' అంటూ ప్రశంసలు కురిపించింది.ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
సంపద సృష్టించడం అంటే ఇది: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఒక రాష్ట్రానికి ఉన్న ఆదాయం కాకుండా.. ఇంకా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని.. భవిష్యత్తులో ఎక్కువ మార్గాలు వచ్చేలా ఉంటే.. అది సంపద సృష్టి’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వైఎస్సార్సీపీ హయాంలోనే సంపద సృష్టి జరిగింది. మూడు కొత్త పోర్టులు.. అదీ నిర్మాణం వేగంగా సాగింది. దాదాపుగా పూర్తి కావొచ్చిన వాటి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అదనపు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. మెడికల్ కాలేజీల వస్తే ఖర్చులు తగ్గుతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో.. సంపద సృష్టి జరుగుతుంది. ఈ పోర్టులు, మెడికల కాలేజీలు భవిష్యత్తు సంపద. ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేయాలి’’ అంటూ చంద్రబాబుకు సూచనలు చేశారు వైఎస్ జగన్.Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
Roti Kapada Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: రోటి కపడా రొమాన్స్నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులునిర్మాణ సంస్థ: లక్కీ మీడియానిర్మాత: బెక్కెం వేణుగోపాల్దర్శకత్వం: విక్రమ్ రెడ్డివిడుదల తేది: నవంబర్ 28, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.75/5 -
విజయ్ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులకు డబ్బుతో పాటు విందు
మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ తాజాగా విందు ఇచ్చారు. మహానాడు జయప్రదం చేసిన వారికి బంగారు ఉంగరాలను అందజేశారు. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వీ సాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం మహానాడు గత నెల 27వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. తొలుత ఈ మహానాడు దక్షిణ తమిళనాడులో నిర్వహించేందుకు ప్రయత్నించినా అనుకున్నంత స్థలం ఏర్పాటు కాలేదు. చివరకు చెన్నై – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీ సాలై వద్ద మహానాడు కోసం స్థలాన్ని ఇవ్వడానికి అనేక మంది రైతులు ముందుకు వచ్చారు. 207 ఎకరాల స్థలాన్ని మహానాడుకు కేటాయించింది. ఒక్కో ఎకరానికి రూ. 10 వేలు అద్దె చెల్లించినట్టు సమాచారం. ఇందులో 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి అద్భుతంగా మహానాడు వేదిక ఏర్పాట్లు చేశారు. మహానాడు ఎవ్వరూ ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. తమిళగ వెట్రి కళగం మద్దతు దారులు విజయ్ కోసం పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. మహానాడుకు ముందుగా ఈ స్థలాలు ఏవిధంగా ఉన్నాయో అదే తరహాలో మళ్లీ తీర్చిదిద్ది మరీ రైతులకు విజయ్ అప్పగించారు. ఈ పరిస్థితుల్లో మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆయన చెన్నైకు పిలిపించారు. పనయూరులోని తమిళగ వెట్రి కళగం కార్యాలయంలో వీరందర్నీ విజయ్ కలిశారు. వారికి తానే స్వయంగా భోజనం వడ్డించి విందు ఇచ్చారు. తాంబులంతో పాటు బట్టలు,పండ్లు , కానుకను అందజేశారు.