-
మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ది రాజాసాబ్ నటి
టాలీవుడ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై సీనియర్ నటి జరీనా వాహబ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ గురించి ఆమె మాట్లాడారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో జరీనా వాహబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ తీరు గురించి ఆమె మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానని జరీనా వెల్లడించారు.జరీనా వాహబ్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్నా. ది రాజాసాబ్‌లో నటిస్తున్నా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. మరో జన్మ ఉంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో తప్పకుండా ప్రభాస్ లాంటి కుమారుడు నాకు కావాలని కోరుకుంటా. అంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అతనొక స్టార్ అనే ఫీలింగ్ లేదు. సెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే షూటింగ్ సిబ్బందితో పాటు అందరికీ భోజనాలు ఇంటికి ఫోన్ చేసి మరి తెప్పిస్తాడు. ప్రభాస్ నిజమైన డార్లింగ్' అంటూ ప్రశంసలు కురిపించింది.ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
కొత్త ట్యాక్స్ కోడ్: రేపటి భారతదేశ నిర్మాణం కోసం..
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనికోసం కొత్త ట్యాక్స్ కోడ్ అవసరమని నిపుణులు బడ్జెట్‌కు ముందే చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను శక్తివంతం చేస్తూ.. నికర రాబడిని పెంచడం వంటివి అవసరం. 2025-26 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు.''ది న్యూ టాక్స్ కోడ్: రేపటి భారతదేశాన్ని నిర్మించడానికి ఆలోచనలు" అనే సెమినార్‌ను థింక్ చేంజ్ ఫోరమ్ (TCF) నిర్వహించింది. ఈ సెమినార్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ మాజీ చైర్మన్ పీసీ ఝా, పాలసీ అడ్వైజరీ & స్పెషాలిటీ సర్వీసెస్ పార్టనర్ అండ్ లీడర్ రాజీవ్ చుగ్, మేనేజింగ్ పార్టనర్ సూరజ్ మాలిక్, సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ మొదలైనవారు పాల్గొన్నారు.జీఎస్టీ కింద చాలా పన్ను రేట్లు ఉండటం మంచి పరిస్థితి కాదు. జీఎస్టీ అనేది ఒక పన్ను రేటుగా మాత్రమే ఉండాలి. కానీ.. మన దేశంలో ఒక పన్ను రేటును కలిగి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి మూడు పన్ను రేట్లను పరిశీలించే అవకాశం ఉంది. అవి 5 శాతం, 16 శాతం & 28 శాతం. 16 శాతం అనేది.. 12 శాతం, 18 శాతానికి బదులుగా రానుందని పీసీ ఝా చెప్పారు.పన్నుల వ్యవస్థలో ప్రస్తుత నిబంధనలను సరళీకృతం చేయాల్సిన అవసరాన్ని సమర్ధిస్తూ.. పన్ను రేట్ల తగ్గింపు పౌరులు.. కంపెనీల చేతుల్లో ఆదాయం పెరగడానికి దారి తీస్తుందని, తద్వారా ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని రాజీవ్ చుగ్ పేర్కొన్నారు. సెమినార్లో పాల్గొన్న ప్రముఖులందరూ కూడా పన్ను చట్టాలలో మార్పుల అవసరని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
Roti Kapada Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: రోటి కపడా రొమాన్స్నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులునిర్మాణ సంస్థ: లక్కీ మీడియానిర్మాత: బెక్కెం వేణుగోపాల్దర్శకత్వం: విక్రమ్ రెడ్డివిడుదల తేది: నవంబర్ 28, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.75/5 -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
సంపద సృష్టించడం అంటే ఇది: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఒక రాష్ట్రానికి ఉన్న ఆదాయం కాకుండా.. ఇంకా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని.. భవిష్యత్తులో ఎక్కువ మార్గాలు వచ్చేలా ఉంటే.. అది సంపద సృష్టి’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వైఎస్సార్సీపీ హయాంలోనే సంపద సృష్టి జరిగింది. మూడు కొత్త పోర్టులు.. అదీ నిర్మాణం వేగంగా సాగింది. దాదాపుగా పూర్తి కావొచ్చిన వాటి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అదనపు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. మెడికల్ కాలేజీల వస్తే ఖర్చులు తగ్గుతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో.. సంపద సృష్టి జరుగుతుంది. ఈ పోర్టులు, మెడికల కాలేజీలు భవిష్యత్తు సంపద. ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేయాలి’’ అంటూ చంద్రబాబుకు సూచనలు చేశారు వైఎస్ జగన్.Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
విజయ్ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులకు డబ్బుతో పాటు విందు
మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ తాజాగా విందు ఇచ్చారు. మహానాడు జయప్రదం చేసిన వారికి బంగారు ఉంగరాలను అందజేశారు. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వీ సాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం మహానాడు గత నెల 27వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. తొలుత ఈ మహానాడు దక్షిణ తమిళనాడులో నిర్వహించేందుకు ప్రయత్నించినా అనుకున్నంత స్థలం ఏర్పాటు కాలేదు. చివరకు చెన్నై – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీ సాలై వద్ద మహానాడు కోసం స్థలాన్ని ఇవ్వడానికి అనేక మంది రైతులు ముందుకు వచ్చారు. 207 ఎకరాల స్థలాన్ని మహానాడుకు కేటాయించింది. ఒక్కో ఎకరానికి రూ. 10 వేలు అద్దె చెల్లించినట్టు సమాచారం. ఇందులో 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి అద్భుతంగా మహానాడు వేదిక ఏర్పాట్లు చేశారు. మహానాడు ఎవ్వరూ ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. తమిళగ వెట్రి కళగం మద్దతు దారులు విజయ్ కోసం పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. మహానాడుకు ముందుగా ఈ స్థలాలు ఏవిధంగా ఉన్నాయో అదే తరహాలో మళ్లీ తీర్చిదిద్ది మరీ రైతులకు విజయ్ అప్పగించారు. ఈ పరిస్థితుల్లో మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆయన చెన్నైకు పిలిపించారు. పనయూరులోని తమిళగ వెట్రి కళగం కార్యాలయంలో వీరందర్నీ విజయ్ కలిశారు. వారికి తానే స్వయంగా భోజనం వడ్డించి విందు ఇచ్చారు. తాంబులంతో పాటు బట్టలు,పండ్లు , కానుకను అందజేశారు. -
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు
ఒట్టావా: కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం వేస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం దీటుగా స్పందించడంపై దృష్టి సారించింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. దక్షిణ, ఉత్తర సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలు, వలసదారుల అక్రమచొరబాట్లను నిలువరించకపోతే అటు మెక్సికో, అటు కెనడా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంవేళ ఓటర్లకు వాగ్దానాలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్, అంతర్గత వ్యవహారాలు, ఇతర శాఖల మంత్రులు, అమెరికాలో కెనడా రాయబారి కిస్టెన్ హిల్మ్యాన్లతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు. ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే కెనడాను మెక్సికోను ఒకే గాటిన కట్టడం అన్యాయమని మంత్రులు జస్టిన్ వద్ద ప్రస్తావించారు. కెనడా నుంచి వలసలను తగ్గించడానికి, వనరులను అందించడానికి, ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఈ సందర్భంగా ట్రూడో అన్నారు. మాదక ద్రవ్యాలు తమ దేశం సమస్య కాదని, సుంకాలు రెండు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడా మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు రూ.22,000 కోట్ల విలువైన వస్తుసేవలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ముడిచమురు అవసరాల్లో 60 శాతం కెనడానే తీరుస్తోంది. 85 శాతం అమెరికా విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తున్నాయి. 34 అత్యంత విలువైన ఖనిజధాతువులు, లోహాలు కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతీకార సుంకాల పరిశీలన.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించే అవకాశాలను కెనడా పరిశీలిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కెనడా సిద్ధమవుతోందని, ప్రతీకారంగా ఏ వస్తువులపై సుంకాలు విధించాలనే విషయంపై చర్చిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అధిక సుంకాలు విధించినప్పుడు, ఇతర దేశాలు ప్రతీకార సుంకాలతో ప్రతిస్పందించాయి. గతంలోనూ 2018లో కెనడా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియంపై అమెరికా అదనపు పన్నలు విధించింది. దీనికి ప్రతికా కెనడా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వేలకోట్ల పన్నులను ముక్కుపిండి వసూలుచేసింది. మెక్సికోతో ట్రంప్ చర్చలు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో అద్భుతమైన చర్చ జరిగిందని ట్రంప్ బుధవారం చెప్పారు. ‘‘వలసదారులు అమెరికా దక్షిణ సరిహద్దు గుండా లోపలికి అక్రమంగా చొరబడకుండా ఇకపై మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోనుంది. ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ చర్యలు అమెరికా చేపడుతున్న అక్రమ ఆక్రమణ నిరోధక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడుతుంది. క్లాడియా షీన్‌బామ్‌కు ధన్యవాదాలు’’అని ట్రంప్ పోస్ట్‌చేశారు. ‘‘అమెరికాలోకి భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై క్లాడియాతో చర్చించా’’అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత అమెరికా అధిక పన్నుల భారం నుంచి మెక్సికోకు ఉపశమనం లభిస్తుందో లేదో తెలియరాలేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. -
హెచ్‌సీఎల్ నుంచి డేటా ట్రస్ట్ షీల్డ్
న్యూఢిల్లీ: ఐటీ రంగ సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ తాజాగా యూఎస్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ సహకారంతో డేటా ట్రస్ట్ షీల్డ్ పేరుతో ఎంటర్ప్రైస్ డేటా సెక్యూరిటీ సర్వీసులను ప్రారంభించింది. క్లౌడ్ వ్యవస్థలో సున్నిత సమాచార రక్షణను ఇది మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటెల్ ట్రస్ట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ (ఇంటెల్ టీడీఎక్స్), ఇంటెల్ ట్రస్ట్ అథారిటీ వంటి విశ్వసనీయ సాధనాలను ఉపయోగించడం ద్వారా క్లౌడ్ కార్యకలాపాల సమయంలో సున్నిత సమాచారాన్ని భద్రపరచడానికి డేటా ట్రస్ట్ షీల్డ్ రూపొందించినట్టు వివరించింది. ఈ సొల్యూషన్ గూగుల్ క్లౌడ్‌లో పరీక్షించామని, భవిష్యత్తులో ఇతర భారీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానిస్తామని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్సిగ్నల్ఈ సేవలు డేటా భద్రతలో ఒక ప్రధాన ముందడుగు అని, అధిక స్థాయి రక్షణను అందిస్తుందని హెచ్‌సీఎల్‌టెక్ ఈవీపీ ఆనంద్ స్వామి వివరించారు. ఇంటెల్ అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ సొల్యూషన్ డిజిటల్ ఆస్తులను సురక్షితం చేస్తుందని, క్లౌడ్ వ్యవస్థపై విశ్వాసం పెంచుతుందని అన్నారు. -
ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు!
తిరుపతి క్రైమ్: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వివరణ ఇవ్వాలి.. నయనతారకి హైకోర్టు నోటీసు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్‌ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే. – సాక్షి, తమిళ సినిమా