Shaik Mohammed Iqbal
-
లోకేష్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంది: ఎమ్మెల్సీ ఇక్బాల్
అనంతపురం: లోకేష్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ధ్వజమెత్తారు. విద్యార్థిని రమ్య హత్య దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమ్య మృతదేహాన్ని తరలించే అంబులెన్స్‌ను అడ్డుకోవడం దారుణమని, టీడీపీ శవ రాజీకాయాలు మానుకోవాలని హితవు పలికారు. పోలీసులపై దాడి సరికాదని, టీడీపీ ఎల్లోమీడియా వక్రభాష్యం మానుకోవాలని మండిపడ్డారు. లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ చిన్నాన్న రామూర్తిని ఎందుకు పరామర్శించలేదని సూటిగా ప్రశ్నించారు. యాసిడ్ బాధితురాలికి కోర్టు ఆదేశించినా చంద్రబాబు రూ.5 లక్షల పరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే టీడీపీ కుట్ర చేస్తోందన్నారు -
బాలకృష్ణా.. హిందూపురం ప్రజలు గుర్తున్నారా?
హిందూపురం: ఓట్లు వేసిన ప్రజలు గుర్తున్నారా అని ఎమ్మెల్యే బాలకృష్ణను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని 32వ వార్డు అహ్మద్ నగర్‌కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ, ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను నమ్ముకున్న కార్యకర్తలతో పాటు ఓట్లు వేసిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, బాబు, పార్టీలో చేరిన వారిలో లక్ష్మణ్ రావు, అతావుల్లా, గంగమ్మ, వలి, ఆల్లాబకాష్, గౌతమ్, జగదీష్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఏపీలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అవకాశం దక్కడం ఆనందంగా ఉందని ఎండీ కరీమున్నీసా తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు సీఎం జగన్ రాష్ట్రంలో అండగా ఉన్నారని చెప్పేందుకు నిదర్శనం తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమేనని అన్నారు. పార్టీతో నడిచినవారికి తగిన గుర్తింపు వైఎస్సార్సీపీలో ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రంలో ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శ్రీకాకుళం : ఎమ్మెల్సీగా తనకు గుర్తింపు ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీకాకుళం నుంచి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి సీఎం వైఎస్ జగన్ వరకు తన ప్రస్థానం కొనసాగిందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్‌కు, పార్టీకి తన సేవలు అంకితమన్నారు. ఇటీవలే టెక్కలి నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు మంచి మోజార్టీతో గెలిచారని గుర్తు చేశారు.ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ పదవికి తన పేరును ఎంపిక చేయడం హర్షనీయమన్నారు. అనంతపురం: వరుసగా రెండోసారి శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ధన్యవాదాలు తెలిపారు. కష్టపడేవారిని సీఎం జగన్ గుర్తిస్తారని.. అడక్కుండానే పదవులు ఇవ్వటం జగన్‌కే సాధ్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని ఇక్బాల్ హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లి : సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పరని మరో మారు నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. నాన్న చనిపోయిన తర్వాత జగనన్న తమకు అండగా నిలిచారని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తనను అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. జగనన్న అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, భవిష్యత్తులో జగనన్న ఇచ్చే ఏ ఆదేశాన్నైనా శిరసవహించడమే తన కర్తవ్యమని కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. చదవండి: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన -
కార్మికుల పొట్టకొట్టిన అచ్చెన్నాయుడు
సాక్షి, హిందూపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్ఐ ఆస్పత్రులకు వైద్యపరికరాల కొనుగోళ్ల పేరుతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కార్మికుల పొట్టకొట్టాడని ఎమ్మెల్సీ షేక్‌మహమ్మద్ ఇక్బాల్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈఎస్ఐ పరికరాల కొనుగోలు స్కాంలో అచ్చెన్నాయుడు దోషి అని, ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారన్నారు. అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో అచ్చెన్నాయుడు ఒకడు కావడం యాధృచ్ఛికమేనన్నారు. ఇందులో ప్రభుత్వ కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులను అప్పగించి ఎక్కువ ధరలతో మెడికల్ కిట్లను కొనుగోలు చేసి దాదాపు రూ.300 కోట్ల స్కాం చేశారని ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ నిరూపించిందన్నారు. స్కాంలలో భాగస్వాములైన టీడీపీ నేతలు, మాజీ మంత్రులు స్టేలు తెచ్చుకోవడం మాని ధైర్యముంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. టీడీపీ హయామంతా ప్రజల సొమ్మును దోచుకోవడం దాచుకోవడమే చేసిందన్నారు. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, ఫైబర్ నెట్ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్నారు. వీటిన్నంటిపై సీబీఐ విచారణ చేయిస్తే అవినీతి బాగోతాలు బయటకొచ్చి అవినీతిపరులు శిక్ష అనుభవిస్తారని ఎమ్మెల్సీ చెప్పారు. చదవండి: ఈఎస్ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్’? -
మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూపురంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి బస్టాండ్‌లోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ..' మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఇక్బాల్ పేర్కొన్నారు. ఏడాదిలోనే మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి'. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రాల్లో లేరని ఇతర రాష్ట్రాల ప్రజలు మాట్లాడటంతోనే ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని తేలిపోయిందని పేర్కొన్నారు. జననేత సుపరిపాలన చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ' ప్రతిపక్ష పార్టీలను పాతాళానికి తొక్కి వైఎస్సార్ పార్టీ తారాజువ్వాలగా ఎగిరిన రోజు మే 23 . కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ సంక్షేమాలు ఆపలేదని, నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయలేని పనిని, ఇచ్చిన మాటను,ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న ఓకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికి అమలు చేయలేడని ప్రతిపక్షాల చేసిన వాఖ్యలను తిప్పికొడుతూ ఏడాదిలోనే చేసి చూపించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎల్లపుడు ఇలాగే ఉండాలని ప్రతిపక్ష పార్టీలు,నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ' తెలిపారు. ప్రజారంజక నేతగా మారారు సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మట్లాడుతూ.. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలు ప్రజలు విశ్వసించడంతో భారీ ఎత్తున విజయాన్ని ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ 90 శాతం మేరకు హామీలను నెరవేర్చి ప్రజారంజక నేతగా మారారని తెలిపారు. కరోనా కష్టకాలం కావడంతో ప్రజా ప్రయోగ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ.. ' సాధారణ వ్యక్తి అయినా నన్ను వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో.. ముఖ్యమంత్రి అయ్యాక వాటికే ప్రాధాన్యత ఇచ్చి 90 శాతం మేరకు పూర్తి చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. కరోనాను అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యంగా ఉన్నాయి'. -
'కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలి'
సాక్షి, అనంతపురం : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ స్పష్టం చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కోవిడ్-19తో ఇంటికే పరిమితం అయిన పేదలకు ఉచితంగా రేషన్ అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి రూ. వెయ్యి ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. -
ఎమ్మెల్సీ బరిలో మహమ్మద్ ఇక్బాల్
సాక్షి, హిందూపురం: రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా.. అందులో ఓ స్థానానికి ఇక్బాల్‌ను పోటీ చేయించనున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి ఉన్న సంఖ్యాబలం పరంగా ఈ మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉండగా.. ఇక్బాల్ త్వరలోనే ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నికల ఓటింగ్‌ను ఈ నెల 26న నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇచ్చిన మాట మేరకు.... ఐజీగా పదవీ విరమణ పొందిన మహమ్మద్ ఇక్బాల్ ఆ తర్వాత వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు సముచిత స్థానం కల్పించిన జగన్మోహన్రెడ్డి హిందూపురం నుంచి బాలకృష్ణపై పోటీకి దింపారు. అయితే ఇక్బాల్ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఇక్బాల్‌కు తొలి విడత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కచ్చితంగా గెలిచే శాసనసభ్యుల కోటాలో ఆయన్ను మండలికి ఎంపిక చేశారు. సీఎం నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీతోనే మైనార్టీల అభ్యున్నతి సాధ్యమని చెబుతున్నారు. మరోవైపు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటును జిల్లాకు కేటాయించడం.. త్వరలోనే ఇక్బాల్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు ఉండటంతో ‘అనంత’ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. -
కేసీఆర్ పై నమోదైన కేసులపై ఏపీ 'సిట్'
హైదరాబాద్: ఏపీ నాయకుల ఫోన్లు టాపింగ్ చేయారంటూ అక్కడి ప్రజాప్రతినిధులు ఆరోపించడంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని దర్యాప్తు చేసేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఐపీఎస్ 1999 క్యాడర్‌కు చెందిన అధికారి మహ్మద్ ఇక్బాల్‌ను సిట్ అధిపతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నియమించింది. ఆయన రాయలసీమలోని కడప జిల్లాకు చెందినవారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుపై ఏపీలో నమోదైన 87 కేసులపై విచారణ చేపట్టాలని ఆయనను ఏపీ సర్కారు ఆదేశించింది. మహ్మద్ ఇక్బాల్ గతంలో మైనార్టీ వర్గాల సంక్షేమ శాఖ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడీ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారిగా, డీఐజీ రేంజ్ ఆఫీసర్‌గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు ఆయనకు చీఫ్ సెక్యురిటీ అధికారిగా, డీఐజీగా ప్రమోషన్ వచ్చేవరకు ఆయన మెదక్ జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.