Amanchi Krishna Mohan
-
రైతుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ పర్యటన: ఆమంచి
సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ఐదేళ్లకు రూ. కోటి ఇస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లకే రూ. 30 కోట్లు ఇచ్చిందన్నారు. శవాలపై పేలాలు ఏరుకున్నట్లు చంద్రబాబు రైతులను పరామర్శించారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయ పర్యటన చేశారని ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఇదీ చదవండి: తప్పుడు కథనాలతో రామోజీ శునకానందం: మంత్రి అంబటి -
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత ఆమంచి ఫైర్
-
మీ ఇద్దరికీ కలిపి చెప్తున్నా..ఆమంచి స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్, పురందేశ్వరికి ఆమంచి స్ట్రాంగ్ కౌంటర్
-
‘వాళ్లంతా వ్యతిరేకం.. అది పవన్ మాటల్లోనే అర్థమయ్యింది’
సాక్షి, గుంటూరు: పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకు ఆయన కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారని, అది పవన్ మాటల్లోనే అర్థమయ్యిందని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీతో పొత్తు వలన కాపులకు కలిగే ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ ప్రయోజనం కోసమే పవన్ పార్టీ పెట్టారని, జనసేన పార్టీ పెట్టి కాపు కులాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దని ఆమంచి అన్నారు. కరోనా వల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తినా సంక్షేమం అందించాం. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. వాలంటీర్ల వ్యవస్థతో పారదర్శకంగా పథకాలను అందిస్తున్నాం. వైసీపీకి భావజాలం లేదనటం సబబు కాదు, ఆ పదాలను పవన్ విత్ డ్రా చేసుకోవాలి. పురందేశ్వరి పూటకో పార్టీ మారుతూ విమర్శలు చేస్తుంటారు. కాంగ్రెస్‌లో ఉంటూ చంద్రబాబును విమర్శించారు. ఇప్పుడు బీజేపీలో ఉంటూ వైసీపీని విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనతో బేరీజు వేస్తూ జగన్ పాలన గురించి మాట్లాడితే బాగుంటుందని ఆమంచి కృష్ణమోహన్ హితవు పలికారు. ‘‘చంద్రబాబుతో మీ బంధుత్వాన్ని రాజకీయాలకు వాడొద్దు. ఇది అసహజమైన పరిణామం. చంద్రబాబుపై కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. పవన్ ఏనాడూ గెలిచింది లేదు. అలాంటి వ్యక్తి జగన్‌ని విమర్శించటం దారుణం. చంద్రబాబు ఎలాంటి యాత్రలు చేసినా ఎదుర్కోవటానికి మేము సిద్దమే. మా బస్సుయాత్రలకు జనం స్పందన బాగుంది’’ అని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
టీడీపీ బోగస్ ఓట్లపై ఏపీ సీఈవోకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ బోగస్ ఓట్ల వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఆమంచి కృష్ణమోహన్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఏపీ సీఈవోను కలిసిన ఆమంచి.. పర్చూరులో టీడీపీ నేతలు చేర్చిన 40వేల బోగస్ ఓట్లను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో.. దొంగఓట్లు చేర్చిన ఏలూరు సాంబశివరావు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్చూరు వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. 1000మంది ఉన్న జనాభా రేషియోకు సుమారుగా 600మంది ఓటర్లు ఉండాలి. 2014 ఎన్నికల సమయంలో 20,801 ఓట్లు కొత్తగా అక్రమంగా చేరాయి. ఎలక్టరోల్ టు పాపులేషన్ రేషియో గణనీయంగా 760కి పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. బోగస్ ఓట్లు భారీగా పెరిగినట్టు 2014లో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ కేసును నీరుగార్చారు. 2014లో పెట్టిన ఆ కేసు ఇప్పటికే తేలలేదు. అందుకే ఇప్పుడు ఆ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయమని ఈసీని కోరాం. పర్చూరులో బాగా చదువుకున్నవారు ఎక్కువమంది ఉన్నారు. 128మంది ఎన్నారైలు 6A ద్వారా ఇక్కడ ఓటు హక్కు కొనసాగిస్తున్నారు. వాళ్ళ బంధువుల ద్వారా దొంగఓట్లు వేస్తున్నారు. కారంచేడులో పక్క ఊర్లు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు 142 ఉన్నాయి. భారతదేశంలో ఏ పౌరుడికైన ఓటు ఒక్క చోటే హక్కు ఉండాలి. పెళ్ళైన మహిళల ఓట్లను ఇంకా అక్కడే ఉంచుతున్నారు. కర్ణాటక జిల్లా రాయచూరులో స్థిరపడి అక్కడ ఓట్లు ఉన్నవారికి పర్చూరులో ఓట్లు ఉన్నాయి. వేరే ఊర్లలో ఉంటూ పర్చూరులో బోగస్ ఓట్లు నమోదు చేసుకున్నారు. ఎలక్షన్ టైంకి బస్సులు, కారుల్లో వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. 2014, 2019లో మొత్తం 40వేల దొంగఓట్లు చేర్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను సొంతంగా పెట్టుకుని దొంగ ఓట్లను కొనసాగిస్తున్నారు. వీఆర్వోల ద్వారా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్తున్నాయి. పూర్తి ఆధారాలు ఈసీకి సమర్పించాను. 2014, 19లో దొంగ ఓట్లు చేర్చిన టీడీపీ నేతలతోపాటు వీఆర్వో, ఎమ్మార్వో, డేటాఎంట్రీ ఆపరేటర్లపై కేసులు నమోదు చేయాలి. చట్ట ప్రకారం శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ కోరాం అని ఆమంచి తెలియజేశారు. -
ఆమంచికి సీఎం పరామర్శ
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ను సీఎం వైఎస్ జగన్ బుధవారం ఫోన్లో పరామర్శించారు. సోమ వారం రాత్రి ఆమంచికి చెందిన ఆక్వా నర్సరీ లో వాకింగ్ చేస్తుండగా కట్లపాము కాటేసింది. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణా పాయం నుంచి కాపాడారు. వైద్యుల సూచన లతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి ఆమంచిని తరలించగా మంగళవారం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. -
పాముకాటుకు గురైన ఆమంచి..
-
వెంకటగిరి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
-
రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (పచ్చమీడియా పైత్యపురాతలు.. గంటల కొద్దీ ఆలస్యానికి ముందే ప్రణాళికలు) -
కిరణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమంచి
సాక్షి, ప్రకాశం: మాస్క్ వివాదంలో ప్రాణాలు విడిచిన యువకుడు కిరణ్ మృతదేహానికి చీరాల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత నివాళర్పించారు. యువకుడి అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కిరణ్ మృతిపై విచారణ చేస్తామని అడిషనల్ ఎస్పీ గంగాధర్ తెలిపారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు దాడి చేయడం వల్లనే ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తుండగా, మాస్కు ఎందుకు వేసుకోలేదని అడిగినందుకు తమతో వాగ్వాదానికి దిగాడని, అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు తీసుకెళ్తుండగా పోలీస్ జీపు నుంచి కిందకు దూకాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేయించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతి చెందిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
‘చంద్రబాబు మద్దతు తెలపడం హాస్యాస్పదం’
సాక్షి, చీరాల: కరోనా కష్టకాలంలో ప్రాణ భయంతో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు నాయుడు, రాజధాని పేరుతో తన సామాజిక వర్గం చేస్తున్న 200 రోజుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు తెలపడం హాస్యాస్పదం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు విదేశాల్లో ఉన్న తన సామాజిక వర్గంతో అమరావతిలో దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 300 కోట్ల రూపాయలతో చంద్రబాబు విదేశాల్లో జల్సాలు చేశారని విమర్శించారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజధాని వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం అని ఆమంచి పేర్కొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమిస్తోంది: కిలివేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి చంద్రబాబు మతి భ్రమిస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిని గ్రాఫిక్స్ లో చూపెట్టి భ్రమరావతి చేసిన చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 108, 104ల వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒకేసారి 1088 అంబులెన్స్ వాహనాలను సీఎం జగన్ ప్రవేశపెడితే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు తాపత్రాయం : దాడిశెట్టి చంద్రబాబు నాయుడు అమరావతి లో ఉన్న తన భూముల కోసం తాప్రతాయ పడుతున్నడు తప్పా, ప్రజల అభివృద్ధి కోసం తాపత్రయం పడడం లేదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాష్ట్ర బాగోగుల కంటే అమరావతిలో ఉన్న 30 గ్రామాల రియల్ ఎస్టేట్ బాగోగులే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటిస్తే దానికి మోకాలడ్డుతూ చంద్రబాబు కోర్టుఓల కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. -
కాపులకు బాబు ద్రోహంపై నోరెత్తలేదేం?
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బాణీలకు అనుగుణంగా నాట్యం చేస్తూ స్క్రిప్ట్ ప్రకారం వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. ఆదివారం వారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పవన్‌కు కనీస పరిజ్ఞానం లేదు.. ► కాపుల సంక్షేమంపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని పవన్ పేర్కొనటం విడ్డూరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపుల సంక్షేమానికి రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది. కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలతో లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమచేసింది. దీనిపై పవన్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదు. మాటకు కట్టుబడి... ► టీడీపీ ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి కాపుల కోసం ఖర్చు చేసింది రూ.1,874 కోట్లు మాత్రమే. చంద్రబాబు తొలి ఏడాది పాలనలో కాపులకు కేటాయించింది సున్నా. పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు నోరెత్తలేదు? చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం 2,54,335 మంది లబ్ధి పొందితే సీఎం జగన్ ఏడాదిలోనే కాపు కార్పొరేషన్ ద్వారా 22,89,319 మందికి లబ్ధి చేకూర్చారు. ► ఏటా రూ.2,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామన్న మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,392.43 కోట్లను కాపుల కోసం జగన్ ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.1,377 కోట్లకుపైగా ఖర్చు చేశారు. సాయం లెక్కలు ఇవిగో.. ► వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 2,35,873 మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.354 కోట్లను సీఎం జగన్ ఇటీవలే వారి ఖాతాలకు జమ చేశారు. అమ్మ ఒడి ద్వారా 3,81,185 మందికి రూ.571.78 కోట్లు, జగనన్న విద్యాదీవెన ద్వారా 1,23,257 మంది లబ్ధిదారులకు రూ.367.63 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. జగనన్న వసతి దీవెన కింద 96,739 మందికి రూ.92.93 కోట్లు, వైఎస్సార్ రైతుభరోసా కింద 7,56,107 మందికి రూ.1,497.29 కోట్లు లబ్ధి కలిగింది. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 3,92,646 మందికి రూ.1125.88 కోట్లు, వైఎస్సార్ వాహనమిత్ర కింద 29,957 మందికి రూ.57.07 కోట్లు సాయం చేశారు. జగనన్న చేదోడు (దర్జీలకు) కింద 14,021 మందికి రూ.14.02 కోట్లు, వైఎస్సార్ నేతన్ననేస్తం కింద 2,577 మందికి రూ.6.18 కోట్లు, విదేశీ విద్యాదీవెన కింద 533 మందికి రూ.29.45 కోట్లు, వైఎస్సార్ జగనన్న ఇళ్లపట్టాల కోసం 2,56,424 మందికి రూ. 663.42 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ బహిరంగంగా కళ్లెదుటే కనిపిస్తుంటే శ్వేతపత్రం ఎందుకు? బాబు డ్రామాలతో కాపులు నష్టపోయారు ► కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. సుప్రీం తీర్పు వల్ల 50% మించి రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదని తెలిసీ చంద్రబాబు ఆడిన డ్రామాలతో కాపులు నష్టపోయారు. జగన్ ధైర్యంగా, నిజాయితీగా ఈ విషయంపై మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని కాపు సోదరులు గమనించాలి. బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించటంపై తమ మద్దతు ఉంటుందని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
‘పవన్ కల్యాణ్‌ను కాపులే తరిమికొడతారు’
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కాపు మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.354 కోట్ల సహాయం చేశారని వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో కాపుల కోసం రూ.4769 కోట్ల సంక్షేమం అందించామని గుర్తుచేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే పవన్ కల్యాణ్ వాటిని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సంక్షేమ పథకాలు కాపులకు అమలు చేయలేమని చంద్రబాబు తేల్చిచెప్పారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కొత్త సంక్షేమ పథకాల్లో కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవాలని హితవు పలికారు. (‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’) కాపులపై ప్రేమ ఉంటే 2014 ఎన్డీఏ ఉమ్మడి ప్రణాళికలో రిజర్వేషన్ల అంశం ఎందుకు చేర్చలేదని ఆమంచి సూటిగా ప్రశ్నించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్ కాల్యాణ్ ఎందుకు హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. మంజునాథ కమిటీ పూర్తి నివేదిక రాకుండానే అసెంబ్లీలో చంద్రబాబు చర్చించారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలు కూడా దీన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. కాపుల్లోని ఐక్యతను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను కాపులే తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ తన రాజకీయ గురువు చంద్రబాబును వదిలేస్తేనే కనీసం ఎమ్మెల్యేగానైనా గెలుస్తారని ఆమంచి హితవు పలికారు. -
భవిష్యత్తులో ఇలాంటి తీర్పులు రాకుండా నిరోధించాలి
-
ఆరు నెలల్లో టీడీపీ మూతపడటం ఖాయం
-
ఆరు నెలల్లో టీడీపీ మూతపడుతుంది
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీ రాజకీయాలు చేస్తున్నారని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ నేతలే తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. దీంతో ఆరు నెలల్లో టీడీపీ మూతపడటం ఖాయమని పేర్కొన్నారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డబ్బులిచ్చి, ప్రలోభపెట్టి చేర్చుకున్నారని విమర్శించారు. గతంలో చేరికలకు, ఇప్పటి చేరికలకు చాలా తేడా ఉందన్నారు. అందరి సహకారంతో కలిసి పని చేస్తామని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. -
విద్యావంతుల ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలి
-
చీరాల ఇన్చార్జి ఆమంచే.. స్పష్టం చేసిన బాలినేని
సాక్షి, ఒంగోలు: చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనేనని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక మీదట కూడా ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలన్నీ ఆమంచి నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. ఇందులో ఎటువంటి అపోహలకూ తావు లేదని పునరుద్ఘాటించారు. ఆమంచి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని బాలినేని పిలుపునిచ్చారు. -
రాజీనామా చేస్తే ప్రజల తీర్పు అగౌరపరిచినట్లే..
సాక్షి, తాడేపల్లి : రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని మరో డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. భోగిమంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోలు, బోస్టన్, జీఎన్ రావు కమిటీ రిపోర్టులు కాలబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామీలతో భూములు కొనుగోలు చేయించారని అన్నారు. అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారని, చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్‌లో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా కేసుల కారణంగా హడావుడిగా అమరావతి వచ్చారని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హృదయాలు గెలుచుకున్నారని అన్నారు. ‘చంద్రబాబును, టీడీపీని గత ఎన్నికలలో ప్రజలు బంగాళా ఖాతంలో కలిపేశారు. దోపిడి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. లోకేష్‌ను సైతం ఓడించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలు 151 సీట్లతో వైఎస్ జగన్‌ను గెలిపించారు. మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజలు తీర్పును అగౌరపరిచినట్లే. సీఎం రమేష్, సుజనాచౌదరి బీజేపి కండువాతో టీడీపీ ఎజెండా ఎత్తుకున్నారు. బీజేపిలోకి పంపించిన బినామీలతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికలలోకు వెళ్లాలి. ఆర్థికమూలాలు పోతున్నాయని తెగ బాధపడిపోతున్నారు. అందుకే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. భవిష్యత్తులో చంద్రబాబు ఎంతమంది పోలీసులను వెంటబెట్టుకున్నా.. రాష్ట్రంలో తిరగలేని పరిస్దితిని కొనితెచ్చుకుంటున్నారు. అది స్వయంకృతాపరాధం. అమరావతిని ముంపు ప్రాంతంగా శివరామకృష్ణ కమిటీ తేల్చిచెప్పింది. చెన్నై ఐఐటీ నిపుణులు కూడా అదే చెప్పారు. కొండవీటి వాగుతో అమరావతి మునిగిపోతుందని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను కరిపెట్టారు. సీబీఐకి అనుమతి రాగానే చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నారు. గతంలో ప్రధాని పర్యటన సందర్భంగా టీడీపీ నల్లజెండాలతో నిరసనలు తెలిపింది. రివర్స్ టెండరింగ్అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంపై సరైన అవగాహన లేదు. టీడీపీ నేతలతోనే జేఏసిలు ఏర్పాటు చేసి ఆందోళనలు చేయిస్తున్నారు. -
పవన్.. దిగజారుడు విమర్శలు చేయొద్దు
-
మేకప్ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో
సాక్షి, తాడేపల్లి : ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఉన్నమాట కొంత వాస్తవం. వరదలతోనే ఇసుక కొరత ఏర్పడింది. ఇసుకలో దోపిడీని అరికట్టి నెలరోజుల వ్యవధిలో మంచి పాలసీ తీసుకువద్దామని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇవేమీ పట్టకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్ నానాయాగీ చేస్తున్నారు. మనల్ని ఎవరూ పట్టించుకోరనే పరిస్థితిని కార్మికులకు కల్పించారు. వారిద్దరి మాటలతో భవన నిర్మాణ కార్మికులు నైరాశ్యంలో పడిపోయారు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల తీరుపై విరుచుకుపడ్డారు. లాంగ్ మార్చ్ పేరిట పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పరిష్కార మార్గాలు చూపించలేదు సరికదా... కార్మికుల సమస్యపై ఆయనకు చిత్తశుద్ది లేదనే విషయం స్పష్టం చేసిందన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వరదల ప్రభావం తగ్గిన తర్వాత ప్రతీ వినియోగదారుడికి కూడా ప్రభుత్వం ఇసుక అందిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు నాగావళి ఇసుకను దోచుకున్నప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో తాము లేమని.. పవన్ సినీ హీరో అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రియల్ హీరో అని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్న పవన్... సీఎం జగన్ పాలనను చూసి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మేకప్ రాసుకుంటే హీరో.. తీసేస్తే జీరో.. ‘మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి గురించి పవన్ విమర్శలు సరికావు. ఆఫ్ ది రికార్డ్ ఎవరు మాట్లాడినా అది బహిరంగ వేదికలో చెప్పరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బొత్స మంచి మెజారిటీతో గెలిచారు. ఇంకో విషయం పవన్ కల్యాణ్.. విజయసాయిరెడ్డితో పోల్చుకోవడం సరికాదు. విజయసాయిరెడ్డి భారతదేశంలో పేరెన్నికగన్న ఆడిటర్. పవిత్రమైన వృత్తిలో ఉన్నారు. ఆయనను అనామకుడి కింద మాట్లాడటం దుర్మార్గం. సినిమాలలో ఎంతో వదులుకుని వచ్చానంటావు. ఏంటి నువ్వు వదులుకుని వచ్చింది. నువ్వు ముఖానికి మేకప్ రాసుకుంటే హీరో. మేకప్ తీసేస్తే జీరో. ఏమి త్యాగం చేసుకుని వచ్చావు చెప్పు. మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయద్దు. నీ గెలుపుకోసం భీమవరంలో సూర్యారావు అనే వ్యక్తి డబ్బు పంచారా లేదా? అసలు నువ్వు ఏ సినిమా తీసినా ఆదాయపన్ను లెక్కల్లో చూపించావా? ఈ రోజుల్లో రాజకీయాలలో ఉండేవారు ఏ పరిస్థితులలో జైలుకు వెళ్లివచ్చారో అందరికీ తెలుసు. చిదంబరం ఇప్పుడు జైలులో ఉన్నారు. 50 దేశాలలో అక్రమ సంపాదన ఉందని చిదంబరంపై కోర్టులలో నివేదికలు సమర్పించారు. అదే చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నపుడు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మీద అసత్య ఆరోపణలతో కేసులు పెట్టారు’ అని ఆమంచి పవన్ తీరును విమర్శించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడతారు అనగానే.. ‘రూ. 700 కోట్ల నష్టాలలో ఉన్న హెరిటేజ్ సరిగ్గా ఏడాదికే రూ. 2,500కోట్లు లాభాలలోకి ఎలా వచ్చింది. అది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే ఎలా సాధ్యం. ప్రజల వద్దకు ఎవరు రమ్మంటే వచ్చావు. పవన్ కల్యాణ్ చెప్పే నీతివంతమైన రాజకీయం శుద్ధ అబద్దం. ఇది పవన్ కల్యాణ్ వద్ద ఉన్న వ్యక్తులు చెప్పిన మాట. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బాస్... నేను మీ పార్టీలోకి వస్తానంటే ఎంపీగా టిక్కెట్టు ఇచ్చి అతడికి ప్రచారానికి కూడా వెళ్లవా.. అతనికి ఓటు వేయమని చెప్పవా. నీతో ప్రవర్తనతో ఆయన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పగలరా పవన్? నువ్వు నిజంగా బలపడి ఓ స్థానంలోకి వస్తే మంచిదే. ప్రజాస్వామ్యంలో అందరికి అది మంచిది. నాదెండ్ల మనోహర్ మాట్లాడతారు అనగానే పవన్ అభిమానులందరూ సైలెంట్ అయిపోయారు. నాదెండ్ల మనోహర్ లింగమనేనికి బంధువు. లింగమనేని చంద్రబాబుకు బంధువు. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యాలు కూల్చొద్దంటావా? నాదెండ్ల మనోహర్ స్క్రిప్టు రాసిస్తే లింగమనేని స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని ప్రస్తావిస్తావా అని పవన్ కల్యాణ్ తీరుపై ఆమంచి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం మాదిరి జనసేనను కూడా టీడీపీ శ్రేణులు నాశనం చేస్తున్నారన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. -
నాగార్జునరెడ్డి.. టీడీపీ ఏజెంట్: ఆమంచి
సాక్షి, తాడేపల్లి : నాగార్జునరెడ్డి గురించి చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నాగార్జున రెడ్డిపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నాగార్జున అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదని.. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన, తన కుటుంబం గురించి నాగార్జున ఫేస్బుక్లో తప్పుడు తప్పుడు రాతలు రాశారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులను సైతం లుచ్చా, కొజ్జా అని పేర్కొంటూ రాసిన ఘనత అతడికే చెల్లిందన్నారు. చంద్రబాబు చచ్చిపోయిన విష సర్పం వంటి వాడని... తన చేతిలో మీడియా ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున గురించి తాను చెప్పిన వాస్తవాలు ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయగలవా అని ప్రశ్నించారు. అతడిపై 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి ‘నాగార్జున సూడో నక్సలైట్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు. భార్యను వేధించిన ఘటనలో అతడిపై కేసు నమోదు అయింది. గతంలో మహిళా ఉద్యోగుల గురించి చెప్పరాని భాషలో తప్పుడు కథనాలు రాశాడు. అంతేకాదు ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసు కూడా అతడిపై ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పనిచేసిన నాగార్జున.. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నాడు. నాగార్జునపై మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి’ అని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆ రిపోర్టర్‌ను హత్య చేయించింది మీరు కాదా? ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి వంతమైన పాలన చూసి చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని సీఎం జగన్‌కు అంటగడుతున్నారు. ప్రస్తుతం నాగార్జునరెడ్డిపై దాడి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ టీడీపీ నేత పుల్లారావు అంధ్రప్రభ రిపోర్టర్ శంకరయ్యను హత్య చేయించినపుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు. నిజానికి చంద్రబాబు టీడీపీలో కీలకంగా ఉన్న సమయంలో రంగ హత్య జరిగింది. రంగాను హత్య చేసిన వారికి శిక్ష పడకుండా చంద్రబాబు కాపాడారు. ప్రస్తుతం కుటుంబ తగాదాలకు కూడా చంద్రబాబు రాజకీయ రంగు పులుముతున్నారు. చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకోలేదా.. ఆయన శవం ముందు విక్టరీ సింబల్ చూపించి శవ రాజకీయాలు చేయలేదా’ అని ఆమంచి కృష్ణమోహన్ ప్రశ్నించారు. -
కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చీరాల నుంచి కరణం బలరామ్ ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ (ఈపీ)పై హైకోర్టు స్పందించింది. కరణం బలరామ్‌తోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులిచ్చి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరణం బలరామ్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని, దీనిపై ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని, అందువల్ల బలరామ్ ఎన్నికను రద్దు చేసి తనను ఎన్నిౖకైనట్లు ప్రకటించాలని ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ఇటీవల ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమంచి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..తన నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్లో ప్రస్తావించలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ చేత రిబ్బన్ కట్ చేయించి నూతన కార్యాలయాన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా జై జగన్.. వైఎస్సార్ అమర్హై అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ పతాకాన్ని ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి చేతుల మీదుగా ముఖ్యమంత్రి దగ్గరుండి ఆవిష్కరింపజేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తాడేపల్లి ప్రాంతంలో సందడి నెలకొంది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కత్తిరింపు తరువాత లోనికి ప్రవేశించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తొలుత తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు పార్టీ కార్యాలయంలోని అన్ని విభాగాలను, అక్కడ జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన చాంబర్లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పి.అనిల్‌కుమార్‌యాదవ్, అవంతి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, మల్లాది విష్ణు, కిలారు రోశయ్య, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, జి.దేవేందర్‌రెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అన్ని హంగులతో కొత్త కార్యాలయం వైఎస్సార్సీపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా పని చేసింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో అక్కడి నుంచే కొంతకాలం పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. కొన్నేళ్ల క్రితం విజయవాడ బందరు రోడ్డులో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో అన్ని హంగులతో కేంద్ర కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇకపై పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.