annaram Sharif
-
సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు మహర్దశ.. అన్నారంషరీఫ్ దర్గాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పర్వతగిరి: సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. అన్నారంషరీఫ్‌లోని హజ్రత్‌సయ్యద్ యాకూబ్‌షావలీ దర్గాలో మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వేర్వేరుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు, కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ వెలుగులు నింపుతున్నారని, ఈ పథకం ద్వారా ఆలయ అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంచారని వివరించారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 36 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్ పాల్గొన్నారు. పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక శోభ తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కల్లెడ, బూర్గుమల్ల గ్రామాల మధ్య స్వయంభూ భైరవ సమేత ఆంజనేయ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఆలయానికి కర్నాటకకు చెందిన మనోజ్‌రావు రూ.10 లక్షల విరాళం అందించనున్నట్లు ఆర్డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రతన్‌రావు, ఏకాంతంగౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, బూర్గుమల్ల సర్పంచ్ ఏడుదొడ్ల ఇందిరాజితేందర్‌రెడ్డి, కల్లెడ సర్పంచ్ కొంపెల్లి శోభాపరమేశ్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సన్నూరు – అన్నారం రోడ్డుకు రూ.4.55 కోట్లు మంజూరు
వరంగల్ : రాయపర్తి మండలంలోని సన్నూరు నుంచి అన్నారం షరీఫ్ గ్రామం వయా ఊకల్–కొండాపూర్ గ్రామాల మీదుగా నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4.55 కోట్లు మంజూరు చేసింది. గతం లో సన్నూరు నుంచి అన్నారం వరకు ఉన్న రహదారిలో అసంపూర్తిగా ఉన్న బిట్‌ను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు. మినీ ట్యాంక్‌బండ్‌గా పెద్ద చెరువు తొర్రూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువును మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మి షన్ కాకతీయ ఫేజ్–2లో రూ. 3.60 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
దత్తన్నకు దత్తత
జిల్లాలో మరో గ్రామానికి దత్తత యోగం పట్టింది. మత సామరస్యానికి ప్రతీక అయిన మండలంలోని అన్నారం షరీఫ్ దశ ఇక మారనుంది. సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)కింద కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇప్పటి కే ఐదు గ్రామాలను లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకున్నారు. దత్తత పొందిన ఆరో గ్రామం అన్నారం షరీఫ్. - అన్నారం షరీఫ్‌కు మహర్దశ - ఎస్ఏజీవై కింద దత్తత - స్థానికుల హర్షాతిరేకాలు అన్నారం షరీఫ్(పర్వతగిరి): జిల్లా కేంద్రానికి 42 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్నారం షరీఫ్‌లో దశాబ్దల క్రితం యాకూబ్ బాబా కొలువుదీరారు. పెద్ద సంఖ్యలో హిందువులూ బాబాను కొలుస్తారు. మొక్కులు తీర్చుకునేందుకు భారీగా కందూర్లు చేస్తారు. ఇక్కడి దర్గాల ఏటా వక్ఫ్‌బోర్డు టెండర్లు నిర్వహిస్తుంది. ఇలా సుమారు రూ. 80 లక్షల ఆదాయం సమకూరుతుంది. సమస్యల జాతర ఇంత ఆదాయం ఉన్నా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దర్గాలో భక్తుల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బందిపడాల్సి వస్తోంది. తాగునీటి సమస్యలూ వెంటాడుతున్నాయి. దర్గా అభివృద్ధి కూడా ప్రధాన సమస్య. 2, 280 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 1740. పంచాయతీ ఇంటి బకాయిలు రూ.3 లక్షలు, నల్లా పన్నుల బకాయిలు రూ. 2 లక్షలు వరకు ఉన్నాయి. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల అభీష్టం.. దత్తత ద్వారా త్వరలో నెరవేరనుంది. దత్తతపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షడు మో టపోతుల మనోజ్‌గౌడ్ మాట్లాడుతూ, గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దితే ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. సర్పంచ్ జడల పద్మ, మండల కో ఆప్షన్ సభ్యుడు షబ్బీర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లూనవత్ పంతులు, రామ్మూర్తి, మాజీ ఉప సర్పంచ్ బూర యాకయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది అన్నారం షరీఫ్‌ను సంసద్ ఆదర్శ్ గ్రామంగా దత్తత తీసుకోవటం మా అదృష్టం. హిందూముస్లింల ఐక్యతకు నిదర్శనమైన గ్రామం మాది. తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను దత్తత ద్వారా పరిష్కరిస్తే ప్రజలకు మేలు కలుగుతుంది. మా గ్రామాన్ని దత్తాత్రేయ దత్తత తీసుకోవటానికి కృషి చేసిన యుగాంతర్ సంస్థ డెరైక్టర్ ఎర్రబెల్లి మదన్‌మోహన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. - జడల పద్మ, సర్పంచ్